యువ క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు సరైనోడు ఎవరైనా ఉన్నాడా టీమిండియాలో అంటే.. అన్‌డౌటెడ్లీ అది రిషభ్ పంతే. 2020-21లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే అందుకు నిదర్శనం. గాబా వేదికగా జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో పంత్ ఆడిన ఇన్నింగ్స్ ఇంకా భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. టీ20 క్రికెట్‌ను మించి ఉత్కంఠ మధ్య సాగిన ఆ మ్యాచ్ చివరి రోజు.. పంత్ విలయతాండవం చేస్తూ.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా జట్టు దాదాపు 30 ఏళ్లుగా, 31 టెస్టుల్లో ఓటమి ఎరుగని మైదానంలో వారి ఘనమైన చరిత్రను బద్దలుకొడుతూ.. ఆట చివరి రోజు 325 పరుగులను ఛేదిస్తూ.. సంచలనం నమోదు చేశాడు. 89 పరుగులతో ఆడిన ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇండియన్ క్రికెట్ చరిత్రలో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తొలి టెస్టు ఓటమి తర్వాత.. టీమిండియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుందంటే.. అది పంత్ వల్లే. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడి.. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే వణికించాడు. పంత్ కొట్టిన దెబ్బ.. కంగారుల అహాన్ని గాయపర్చింది. దానికి ప్రతీకరం తీర్చుకునేందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్‌లో అడుగుపెట్టింది.
అయితే.. గత సిరీస్‌లో ఆస్ట్రేలియాను భయపెట్టినోడు, టెస్టుల్లో టీమిండియా ఫియర్‌లెస్ క్రికెట్ నేర్పినోడు ఇప్పుడు జట్టులో లేడు. దురదృష్టవశాత్తు కారు ప్రమాదానికి గురైన పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీంతో ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పంత్ అందుబాటులో లేడు. కచ్చితంగా ఈ సారి టీమిండియా పంత్‌ను మిస్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం బ్యాటింగ్‌లోనే పంత్ లోటు కనిపిస్తుందనుకుంటే అది పొరపాటే. ఆస్ట్రేలియాన్లను పంత్ కేవలం తన బ్యాటింగ్‌తోనే కాదు.. మాటతోనే భయపెట్టాడు. బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ.. ఇక్కడ టీమిండియా మిస్ అయ్యేది, ఆస్ట్రేలియాకు ప్లస్ అయ్యే విషయం ఒకటుంది. అదే స్లెడ్జింగ్. ఈ పదం నెగిటివ్‌గా ఉన్నా.. క్రికెట్‌లో నైతికంగా కరెక్ట్ కాకపోయినా.. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై గెలవాలంటే కాస్త లైన్ దాటాల్సిందే.
ముళ్లును ముళ్లుతోనే తీయాలనే కాన్సెప్ట్ రిషభ్ పంత్‌ది. అతను అలానే ఆడతాడు. సేమ్ విరాట్ కోహ్లీది కూడా అదే మైండ్ సెట్. ఆస్ట్రేలియాకు వీరిద్దరు సరైనోళ్లు కానీ.. ప్రస్తుతం కోహ్లీ టీమ్ కెప్టెన్ కాకపోవడంతో.. పిచ్‌కు దగ్గరగా ఉండే సమయం తక్కువ. కానీ.. పంత్ విషయంలో అలా కాదు. అతను వికెట్ కీపర్ కాబట్టి. అనుక్షణం బ్యాటర్లకు చాలా దగ్గరగా ఉంటాడు. నిత్యం బౌలర్లను ఎంకరేజ్ చేస్తూ.. కంగారుల జిత్తులను ఎప్పటికప్పుడు బౌలర్లకు చెబుతుంటాడు. స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉన్న ఆస్ట్రేలియాకు వారి భాషలోనే సమాధానం చెప్పగల దిట్ట పంత్. మాటకు మాట చెబుతూ.. ఆస్ట్రేలియాను కంట్రోల్‌లో పెట్టాలంటే పంతే సరైనోడు. ఆ విషయం ఆస్ట్రేలియాకు కూడా తెలుసు.
ఇప్పుడు పంత్ జట్టులో లేకపోవడం అతని స్థానంలో ఆడే అవకాశం ఉన్న కేఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్ మృధుస్వభావులు కావడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. కానీ.. పంత్ జట్టులో ఉండి ఉంటే.. ఆస్ట్రేలియాకు అతని బ్యాటింగ్ భయంతో పాటు.. మనం ఏదైన అంటే దానికి పంత్ రెండు అంటాడనే భయం ఉండేది. కానీ దురృష్టవశాత్తు టెస్టుల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న పంత్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొంది కోలుకుంటున్నాడు. అతను త్వరగా కోలుకుని మళ్లీ తిరిగి టీమిండియాలోకి వచ్చి.. అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచేలా రాణించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bgt will miss pant’s commentary and his innings!❤️@RishabhPant17 • #BorderGavaskarTrophypic.twitter.com/c79Y3gRMld
— Aayushi (@aayushiii_09) February 4, 2023
BGT is Coming but Rishabh Pant will not be there🥺🥺🥺
I can’t see any other keeper except Rishabh Pant 😔😔#RishabhPant #INDvNZ #NZvIND #INDvsNZ #BorderGavaskarTrophy #INDvsAUS #INDvAUS pic.twitter.com/RYlcjQityF
— Cric18👑 (@Criclav_18) January 29, 2023