టీమిండియా మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. టీమిండియా టెస్ట్ క్రికెట్ లో సలీం దురాణీ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. భారత్ గెలిచిన పలు టెస్టు సిరీస్ లలో సలీం దురానీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 1961-62 ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో టీమిండియా ఘన విజయం సాధించడానికి సలీం దురానీనే ముఖ్య కారణం.
టీమిండియా స్టార్ ప్లేయర్, స్పిన్ ఆల్రౌండర్ సలీం దురానీ కన్నుమూశారు. ఆదివారం ఉదయం గుజరాత్ లోని జామ్ నగర్ లో సలీం దురానీ(88) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. జనవరి నెలలో తొడ ఎముక విరగడంతో చికిత్స కూడా చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న సలీం దురానీ ఆదివారం కాలం చేశారు. టీమిండియా తరఫున సలీం దురానీ మొత్తం 29 టెస్టులు ఆడారు. 7 హాఫ్ సెంచరీలు చేసిన ఆయన మొత్తం.. కెరీర్ లో 1202 పరుగులు చేసి.. 75 వికెట్లు తీశారు.
సలీం దురానీ మృతిపట్ల టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం తెలియజేశారు. సలీం దురానీ డిసెంబర్ 11న ఆఫ్గనిస్థాన్ లోని కాబూల్ లో జన్మించారు. ఆ తర్వాత కరాచీకి వలస వెళ్లారు. 1947లో భారత్- పాకిస్తాన్ విభజన సమయంలో భారత్ వచ్చి స్థిరపడిపోయారు. సలీం దురానీ 1960లో ముంబై వేదికగా ఆస్ట్రేలియాపై టెస్టు డెబ్యూట్ చేశారు. దురానీ అనగానే చాలామందికి 1961-62 ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గుర్తొస్తుంది. కోల్ కతాలో 8 వికెట్లు, చెన్నైలో 10 వికెట్లు తీసి.. 2-0 తేడాతో భారత్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
Rare video of Salim Durani’s bowling action. On his day, the man left others of his type way behind! @BishanBedi @mahaanmahan @AmritMathur1 @gulu1959 @MarcusNotRichar @SaikiaArup @Cric_Writer pic.twitter.com/bst9FopWqv
— Rameshwar Singh (@RSingh6969a) August 31, 2020
రంజీ ట్రోఫీల్లో దురానీని 1967-70 మధ్య మొత్తం 4 సీజన్లు పక్కన పెట్టారు ఆ తర్వాత 1971లో వెస్టిండీస్ టూర్ కోసం సలీం దురానీకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. వెస్టిండీస్ లో తొలి సిరీస్ విజయంలో సలీం దురానీ తనదైన పాత్రను పోషించారు. 1973లో తన తొలి టెస్టు ఆడిన ముంబై బార్ బ్రౌన్ స్టేడియంలోనే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోనూ సలీం దురానీకి మంచి రికార్డులు ఉన్నాయి. 33.37 బ్యాటింగ్ సగటుతో 8,545 పరుగులు చేశారు. వీటిలో 14 శతకాలు ఉన్నాయి. ఈయనకు సిక్స్ హిట్టర్ అనే పేరు కూడా ఉంది.
Salim Durani hits Jack Birkenshaw for six in the 1972-73 Bombay Test. Video from @jaigalagali
This hit took him from 49 to 55. pic.twitter.com/OetQ5JxvYw
— Rameses (@tintin1107) April 2, 2023