టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌లో దారుణ ఆట తీరుతో విమర్శల పాలు అవుతున్న విషయం తెలిసిందే. ముందుగా పాకిస్థాన్ తో మ్యాచ్ ఓడినా.. అందరూ టీమిండియాకి మద్దతుగానే నిలిచారు. ఒక్క మ్యాచ్ తోనే ఆటగాళ్ల నిబద్ధతని క్వశ్చన్ చేయడం పద్ధతి కాదని అంతా కామ్ అయిపోయారు. కానీ.., కీలకమైన న్యూజిలాండ్ మ్యాచ్ లోనూ మన ఆటగాళ్లు చేతులు ఎత్తేశారు. కనీసం పోరాటతత్వం చూపించకుండానే మ్యాచ్ ని కివీస్ కి సమర్పించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కి మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి.
న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయాక జస్ప్రీత్ బుమ్రా సంచలన ట్వీట్ చేశాడు. 6 నెలల పాటు బయో బబుల్ లో, ఫ్యామిలీకి దూరంగా ఉండటం అంత సులభమైన విషయం కాదు. ఈ పరిస్థితిని అలవాటు చేసుకోవడానికి మేము చాలా కష్ట పడ్డాము. కానీ.., ఈ సుదీర్ఘ కాలంలో బబుల్ లో ఉండటం కారణంగా అలసిపోయాము అని బుమ్రా ట్వీట్ చేశాడు. అయితే.., ఇప్పుడు ఈ ట్వీట్ కి నెటిజన్స్ అదిరిపోయే రిప్లయ్ ఇస్తున్నారు.
బబుల్ లో ఇంత కాలం ఉండటం ఇబ్బంది అని భావిస్తే.. ఇంగ్లాండ్ టూర్ అయిపోగానే ఆటగాళ్లు ఇండియా వచ్చేయాల్సింది. ఇక్కడ కొంత కాలం ఫ్యామిలీతో గడిపి, వరల్డ్ కప్ సన్నద్ధం కావాల్సింది. లేదా? వరల్డ్ కప్ సెలక్ట్ అయినా తరుణంలో నైనా మేము పూర్తి సిద్ధంగా లేమని తప్పుకోవాల్సింది. అప్పుడు డబ్బు కోసం ఐపీఎల్ ఆడి, ఇప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అలసి పోయామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అంటూ. నెటిజన్స్ బుమ్రా పై విరుచుకుపడుతున్నారు. మరి.. బుమ్రా చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.