ప్రస్తుతం భారత్-వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ నడుస్తోంది. శుక్రవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడం, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని రెస్ట్‌లో ఉండటంతో ఈ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ ధావన్‌కు అప్పగించింది.
దీంతో ఈ ఏడాదిలో శిఖర్ ధావన్ 7వ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయంలో భారత జట్టు శ్రీలంక నమోదు చేసిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ మంది కెప్టెన్లను మార్చిన దేశంగా శ్రీలంక పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. 2017లో శ్రీలంక ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చగా.. తాజాగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా ఆ రికార్డును సమం చేసింది.
కాగా ఇలా కెప్టెన్లు తరచూ మార్చడంపై బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వీటిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా ఈ సిరీస్‌కు ముందు స్పందించారు. పనిభారం, గాయాలతో ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతోనే కెప్టెన్లను మార్చాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు. కాగా.. 1959లో కూడా భారత జట్టుకు ఇంచుమించు ఇలాగే కెప్టెన్లను మార్చింది.
ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లుగా విరాట్ కోహ్లి (సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్), కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు), రోహిత్ శర్మ (సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్‌లు), రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్), హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ 5వ టెస్ట్), శిఖర్ ధావన్(వెస్టిండీస్‌తో వన్డే సిరీస్) వ్యవహరించారు. అలాగే భారత్, శ్రీలంక తర్వాత.. జింబాబ్వే(2001), ఇంగ్లండ్(2011), ఆస్ట్రేలియా(2021) ఒకే ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లను మార్చింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Team India equal Sri Lanka’s world record for having MOST CAPTAINS in a year https://t.co/KW1Vo59K20
— Bangalore News Today (@TodayBangalore) July 23, 2022