ప్రస్తుతం టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. తొలి టీ20లో గెలిచిన కివీస్.. రెండో మ్యాచ్ లో తడబడింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది టీమిండియా. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యింది భారత జట్టు. ఇక మ్యాచ్ కు ముందు భారత ఆటగాళ్లు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాను థియేటర్లో వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిల్మ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీపికా పదుకోణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో మెరిసి అభిమానుల ఆదరణ చురగొంటోంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటికే రూ. 600 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా కివీస్ తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా అహ్మదాబాద్ వచ్చింది.
ఈ క్రమంలోనే మ్యాచ్ కు ముందు పఠాన్ సినిమాను థియేటర్లో చూశారు టీమిండియా ఆటగాళ్లు. కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, చాహల్ తో పాటు మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ లతో పాటుగా మరికొంత మంది టీమిండియా క్రికెటర్లు సినిమాను చూశారు. ఇలా మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు సినిమా చూసి రిలాక్స్ అవ్వడం ద్వారా వారిలో కొత్త ఎనర్జీ వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి పఠాన్ సినిమా చూసిన టీమిండియా ప్లేయర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.