భారతదేశ వ్యాప్తంగా మంగళవారం(మార్చి 7) హోలీ వేడుకలను దేశ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు సైతం హోలీ సెలబ్రేషన్స్ ను డ్యాన్స్ లతో, అరుపులతో, రంగులు చల్లుకుని జరుపుకున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల హోలీ సెలబ్రేషన్స్ వీడియో వైరల్ గా మారింది.
గతకొంత కాలంగా టీమిండియా ఆటగాళ్లు తీరికలేకుండా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ మెుదలుకొని కివీస్, బంగ్లా, ఆసిస్ జట్లతో మ్యాచ్ లు ఆడుతూ.. బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. కీలకమైన నాలుగో టెస్ట్ కు టీమిండియా సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే మధ్యలో వచ్చిన హోలీ పండగను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
భారతదేశ వ్యాప్తంగా మంగళవారం(మార్చి 7) హోలీ వేడుకలను దేశ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలారు. ఇక హోలీ పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. తమ జర్నీలోనే ఈ సంబరాలను నిర్వహించారు భారత ప్లేయర్స్.బస్సులో వెళ్తూ.. రంగులు పూసుకుని హోలీని ఘనంగా జరుపుకున్నారు. కోహ్లీ సింప్లీ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడితే.. రోహిత్ తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ.. వీడియో తీస్తున్న శుభ్ మన్ గిల్ ఫోన్ పై రంగు చల్లాడు.
ఈ క్రమంలోనే బస్సులో అందరు ఆటగాళ్లు ఆడుతూ.. పాడుతూ.. హోలీని ఎంజయ్ చేశారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల హోలీ సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆసిస్ తో కీలకమైన నాలుగో మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. పైగా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అటు ఆసిస్ ప్రధానితో పాటుగా.. ఇటు భారత ప్రధాని కూడా మైదానానికి రానున్నారు. ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ ను చూడనున్నారు.
Virat Kohli and team India fully enjoying Holi. pic.twitter.com/XiognDen5G
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2023