జింబాబ్వేపై సిరీస్ విజయాన్ని భారత ఆటగాళ్లు ఒక రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విచిత్రమైన డాన్స్‌తో హోరెత్తించారు. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ సంబురాలను చేయి అడ్డును తొలగించి ప్రారంభించగా.. ఇషాన్ కిషన్, ఆవేశ్ ఖాన్, సిరాజ్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ సంబురాల్లో మునిగి తేలారు. ‘కాలా చష్మా’ అనే హిందీ పాటకు ఇష్టమొచ్చినట్లు ఎగిరారు. ఈ వీడియోను చేయి తొలగించి ప్రారంభించిన కెప్టెన్ రాహుల్ మాత్రం ఈ గ్రూప్‌లో డాన్స్‌లో పాల్గొనలేదు. ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్, సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ మాత్రం రెచ్చిపోయారు.
ప్రస్తుతం వీరి సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటగాళ్లు ఎంతో సంతోషంతో చిందులేస్తున్న వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా.. మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేలను సునాయాసంగానే గెలిచిన భారత్.. మూడో వన్డేలో గెలుపుకోసం కొంత చెమటొడాల్సి వచ్చింది. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రజా సెంచరీతో చెలరేగడంతో ఒకానొక దశలో జింబాబ్వే విజయం సాధించేలా కనిపించింది. కానీ.. ఇదే మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన గిల్.. అద్భుతమైన డైవ్ క్యాచ్‌తో రజాను అవుట్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయినా.. వారు చూపించిన పోరాట పటిమపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత ఆటగాళ్లు కూడా జింబాబ్వే చూపిన పట్టుదలను మెచ్చుకున్నారు. ఇప్పటికే వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌కు ఇది వరుసగా రెండో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్. దీని తర్వాత.. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో భారత్ పాల్గొననుంది. 28న పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్ వేటను ప్రారంభిస్తుంది. మరి జింబాబ్వేపై సిరీస్ విజయం, టీమిండియా ఆటగాళ్ల సంబురాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తొలి సెంచరీతో.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్!
😂😂😂😂 pic.twitter.com/PnsquoWZN2
— Out Of Context Cricket (@GemsOfCricket) August 22, 2022