టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి సడన్ గా కనిపించకుండాపోయాడు. ఈ విషయం.. సదరు క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అలా జరిగిందని మరో పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఏంటి సంగతి?
టీమిండియా అంటేనే ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతారు. మ్యాచులుంటే గేమ్ చూస్తారు. లేదంటే క్రికెటర్ల ఏం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటని తెలుసుకోవాలని ట్రై చేస్తారు. జట్టులో కావొచ్చు, క్రికెటర్ల ఇంట్లో కావొచ్చు ఏం జరిగినా సరే వెంటనే తెలుసుకుంటూ ఉంటారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్లో పెళ్లి జరిగినా, కోహ్లీ ఏదైనా ఈవెంట్ కు వెళ్లినా సరే అందుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసేస్తూ ఉంటారు. సరే ఇదంతా పక్కనబెడితే టీమిండియా క్రికెటర్ తండ్రి కనిపించకుండా పోయాడనే న్యూస్ ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడిపోయారు. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత జట్టుకు ఆడిన ఆల్ రౌండర్స్ లో కేదార్ జాదవ్ ఒకడు. 2014లో జాతీయ జట్టులోకి వచ్చిన ఇతడు.. చివరగా 2020లో న్యూజిలాండ్ తో వన్డే ఆడాడు. అప్పటినుంచి దేశవాళీ మ్యాచులతో పాటు ప్రతి సీజన్ లో ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే కేదార్ జాదవ్ తండ్రి మహాదేవ్ జాదవ్ మహారాష్ట్రలోని పుణెలో అదృశ్యం అయ్యారనే న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయింది. స్వయంగా కేదార్ జాదవ్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టడంతో అందరూ అలెర్ట్ అయిపోయారు. సోమవారం అంటే మార్చి 27 ఉదయం 11:30 గంటల టైంలో రిక్షా ఎక్కారు. ఆ తర్వాత మహాదేవ్ ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ రావడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.
ఈ క్రమంలోనే తండ్రి కనిపించకపోవడంతో కేదార్ జాదవ్ పోలీసులు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కేవలం నాలుగు గంటల్లోనే ఆయనని గుర్తించారు. కేదార్ జాదవ్ కు అప్పగించారు. ఇందుకు సంబంధించి మరో ఫొటోను టీమిండియా క్రికెటర్ తన ఇన్ స్టా స్టోరీలోనే పోస్ట్ చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు ఆడి వెలుగులోకి వచ్చిన కేదార్ జాదవ్.. 2014లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 73 వన్డేలు ఆడి 1389 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉన్నాయి. 27 వికెట్లు కూడా తీశాడు. 9 టీ20ల్లో 58 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో అయితే 93 మ్యాచులాడి 1196 పరుగులు చేశాడు. చెన్నై, దిల్లీ, బెంగళూరు జట్లకు ఆడి ఈ పరుగులు చేశాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి కనిపించకుండా పోయి మళ్లీ దొరకడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.