బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే తుది జట్టు ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా కీపర్ శ్రీకర్ భరత్ జట్టులో ఉంటాడా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా మూడో టెస్టులో పుంజుకుంది. టర్నింగ్ ట్రాక్‌పై టీమిండియాను కోలుకోలేని దెబ్బతీసి విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టెస్టు మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచులో ఆసీస్ నెగ్గితే సిరీస్‌ను వారు సొంతం చేసుకోలేరు గానీ డ్రా అవుతుంది. అదే టీమిండియా గెలిస్తే సిరీస్ విక్టరీతో పాటు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తూ ఖాయమవుతుంది. ఆ లెక్కన కంగారూల కంటే మనకే ఆ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ టెస్టుకు లక్ష మంది వరకు హాజరు కానున్నారని అంచనా. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్నారు.
నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఆడటం అనుమానంగా మారింది. గత మూడు టెస్టుల్లో 8, 6, 23 నాటౌట్, 17, 9 రన్స్ మాత్రమే చేశాడతను. దీంతో చివరి టెస్టులో అతడిపై వేటు తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిస్తూ ఇషాన్ కిషన్ అహ్మదాబాద్ టెస్టు కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఆఖరి టెస్టులో భరత్‌కు అవకాశం ఇస్తారా లేదా అతడి స్థానంలో ఇషాన్‌కు చాన్స్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం భరత్‌కు మద్దతుగా నిలిచాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టులు భరత్ పెర్ఫార్మెన్స్పై అడిగిన ప్రశ్నలకు ద్రవిడ్ జవాబిచ్చాడు.
‘భరత్ పెర్ఫార్మెన్స్పై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. అతడి దృక్పథం మీద మళ్లీ ప్రశ్నలు వస్తున్నాయి. సవాళ్లు, పరిస్థితులను అర్థం చేసుకుని ఆడేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడు. మూడో టెస్టులో భరత్ గొప్పగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతడు చేసిన 17 రన్స్ చాలా కీలకం. ఢిల్లీలోనూ సానుకూలంగానే ఆడాడు. కఠినమైన పిచ్‌లపై కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ, భరత్‌కు అది కలసిరాలేదు. అతడు ఆడే విధానం మాత్రం బాగుంది. భరత్ బ్యాటింగ్‌పై ఆందోళన చెందకుండా మరింతగా దృష్టి పెడతాం’ అని ద్రవిడ్ ఈ యువ బ్యాటర్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ద్రవిడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే చివరి టెస్టులో భరత్ ఆడటం ఖాయంలా కనిపిస్తోంది. మరి.. భరత్‌కు మరో చాన్స్ ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.