కేఎల్ రాహుల్.. జట్టులో ఉండటమైతే ఉన్నాడు స్థాయికి తగ్గట బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. గత కొన్నాళ్లుగా నిరాశపరుస్తూనే ఉన్నాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టుకు రాహుల్ కెప్టెన్సీ చేశాడు. చట్టోగ్రామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో టీమిండియా, 188 పరుగుల తేడాతో బంగ్లా జట్టుపై విజయం సాధించింది. వన్డే సిరీస్ లో ఓడిపోయిన మన జట్టు.. టెస్టు సిరీస్ లో మాత్రం ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలోనే రోహిత్ కూడా సాధ్యం కాని ఘనతని తాత్కాలిక కెప్టెన్ గా కేఎల్ రాహుల్ సాధించాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసింది. బంగ్లాని 150 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 258/2 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన భారత్.. ప్రత్యర్థి జట్టుకు 512 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో 324 పరుగులకు బంగ్లా జట్టు ఆలౌటైంది. ఫలితంగా తొలి టెస్టులో మనం విజయం సాధించాయి. అయితే రోహిత్ కు గాయం కావడంతో ఈ మ్యాచ్ కు కెప్టెన్సీ చేసిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో తొలి విజయం దక్కించుకున్నాడు. అంతకు ముందు ఆసియాకప్ లో ఆఫ్ఘానిస్థాన్ పై టీ20లో గెలుపు, జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్ విజయం కూడా సాధించింది. ఇలా మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాని గెలిపించిన ఐదో కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కేఎల్ రాహుల్ కంటే ముందు.. వీరేంద్ర సెహ్వాగ్, ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె.. ఈ ఘనత నమోదు చేశారు.
మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ.. ఇప్పటివరకు విదేశాల్లో ఒక్క టెస్టుకు కూడా సారథ్యం వహించలేదు. 2022 స్టార్టింగ్ లో జరిగిన దక్షిణాఫ్రికా టూర్, ఆ తర్వాత ఇంగ్లాంట్ పర్యటనలో ఐదో టెస్టుకు ముందే రోహిత్ గాయపడటంతో.. ఆ మ్యాచులకు దూరమయ్యాడు. ఇప్పుడు ఇతడికే సాధ్యం కానీ రికార్డుని కేఎల్ రాహుల్ సాధించడంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. అదే టైంలో బ్యాటింగ్ పై కూడా దృష్టి పెట్టి అందులో నూ రికార్డులు నమోదు చేయాలని ఆశపడుతున్నారు. ఇక టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య చివరిదైన రెండో టెస్టు డిసెంబరు 22 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో గెలిచినా, డ్రా చేసినా సరే.. టెస్టు సిరీస్ టీమిండియా సొంతమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి కెప్టెన్ రాహుల్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాన్నా కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
KL Rahul is the fifth Indian captain to achieve this feat.#BANvIND pic.twitter.com/qYjr2J0YUX
— CricTracker (@Cricketracker) December 18, 2022