లక్నో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ చెలరేగారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు రికార్డులను కూడా బద్ధలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల సమిష్టి కృషితో ఈ మ్యాచ్‌ను భారత్ చాలా సునాయాసంగా గెలిచింది. కానీ ఫీల్డింగ్ విషయంలో మాత్రం అట్టర్‌ఫ్లాప్ అయింది. మ్యాచ్ గెలవడంతో ఇవేవి చర్చకు రాలేదు. కానీ ఒక టాప్ టీమ్ చేయాల్సిన ఫీల్డింగ్‌ను మాత్రం టీమిండియా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో చేయలేదు. ఏకంగా మూడు ఈజీ క్యాచ్‌లను జారవిడిచారు టీమిండియా ఫీల్డర్లు. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్‌లు తలా ఒక క్యాచ్ మిస్ చేశారు.
టీ20ల్లో నంబర్ వన్ జట్టు ఫీల్డింగ్ లెవల్స్‌కు తగ్గట్లు గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఫీల్డర్లు అందుకోలేకపోయారు. ధోని కెప్టెన్ కాకముందు టీమిండియా ఫీల్డింగ్‌లో చాలా వీక్‌గా ఉండేది. కైఫ్, యువీ తప్ప గొప్ప చెప్పుకునే ఫీల్డర్లు ఎవరూ లేరు. కానీ ధోని కెప్టెన్ అయిన తర్వాత ఆటగాళ్ల ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్‌పై ఫోకస్‌చేశాడు. అది టీమిండియా గణనీయ మార్పులను తెచ్చింది. బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్లు మధ్య వేగంగా పరుగులు తీయడంలో, ఫీల్డింగ్ సమయంలో బౌండరీలను ఆపడంలో చాలా ఉపయోగపడింది. దీంతో చాలా పరుగులు సెవ్ అయ్యేవి. కోహ్తీ, యువీ, రైనా, జడేజా, గంభీర్ ఇలా చాలా మంది తమ అద్భుత ఫీల్డింగ్‌తో చాలా రన్స్ సెవ్‌చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందా అనేలా ఉంది భారత ఫీల్డింగ్. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు మిస్ అవ్వడంపై కోచ్ ద్రవిడ్ కూడా సీరియస్ అయినట్లు సమాచారం.
కఠినమైన క్యాచ్‌లు మిస్ అవ్వడం సాధారణం కానీ.. సులభమైన క్యాచ్‌లను మిస్ చేయడం మాత్రం ఉపేక్షించలేనిది. కాగా ఈ విషయంలో టీమిండియా ఫీల్డర్లను సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మనది టాప్ క్లాస్ జట్టని ఇలా చెత్త ఫీల్డింగ్‌తో పరువు తీయవద్దని పోస్టులు చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లు చేతులకు ఆయిల్ పూసుకుని గ్రౌండ్‌లో దిగినట్లు ఉందని సెటైర్లు కూడా పేలుస్తున్నారు. అలాగే శీలంక ఆటగాళ్లు కూడా రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. కానీ వారిది సాధారణ జట్టు. దాదాపు అందరు యువ ఆటగాళ్లు. కానీ టీమిండియా అలా కాదు. మరి శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.