టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఆదివారం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఇందులో గనుక ఒకవేళ న్యూజీలాండ్ ఓడిపోయి ఉంటే భారత్ సెమీస్ ఆశలు సజీవమయ్యేవి. కానీ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై న్యూజిలాండ్ గెలిచి ఏకంగా సెమీస్ కు దూసుకెళ్లింది. దీంతో టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే టీమిండియా తొలి ఓటములపై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కామెంట్స్ చేశాడు. ఇండియా టాస్ ఓడిపోవడం వల్లే పరాజయం పాలయిందని అన్నారు.
ఇక కోచ్ భరత్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. టీమిండియా ఓటమికి టాస్ ఓటమి అస్సలు కారణం కానే కాదని ఆయన అభిప్రాయాపడ్డాడు. కాగా పాకిస్తాన్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన చేయటంతో మన ఆటగాళ్లు ఎక్కువ పరుగులు సాధించలేకపోయారని తెలిపారు. ఇక ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మన ఓపెనర్లు విరుచుకుపడి భారీ రన్స్ చేశారు. దీంతో మొదటి రెండు మ్యాచుల్లో కూడా టీమిండియా ఆటగాళ్లు ఇలాంటి ఆట తీరును కనబరిచి ఉంటే మరోలా ఉండేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయాపడ్డాడు.