టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో తొలి ఓటమిని చవిచూసింది. పేస్ బౌలింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పెర్త్ పిచ్‌పై టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ.. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(15), ఓపెనర్ కేఎల్ రాహుల్(9), వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ(12)లను లుంగి ఎన్గిడి వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టించాడు. షార్ట్ పిచ్ బంతులకు ఇబ్బంది పడిన ఈ ముగ్గురు టాప్ క్లాస్ బ్యాటర్లు.. పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు.
మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగుల స్కోర్ చేసింది. పెర్త్ పిచ్‌పై ఈ మాత్రం స్కోర్ కూడా మంచి ఫైటింగ్ టార్గెట్టే. ఇదే నమ్మకంతో బౌలింగ్‌కు దిగిన టీమిండియాకు.. అర్షదీప్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్, రోలి రోసోవ్‌లను ఒకే ఓవర్‌లో అవుట్ చేసి చావు దెబ్బకొట్టాడు. 10 ఓవర్లకు 40 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మార్కరమ్, మిల్లర్ అద్భుత హాఫ్ సెంచరీలతో విజయతీరాలకు చేర్చారు. దీంతో లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత.. భారతకు చెందిన ఫుడ్ డెలవరీ సంస్థ జొమాటో పాకిస్థాన్‌ను దారుణంగా ట్రోల్ చేసింది.
‘ఆర్డర్ ప్లేస్డ్ ఫర్ హోమ్ డెలివరీ ఆఫ్ పాక్ టీమ్’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. మనకంటే కూడా పాకిస్థాన్‌కు ఎక్కువ బాధ కలిగించి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటికే భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడిన పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా సౌతాఫ్రికాపై గెలవాల్సి ఉంది. కానీ.. సౌతాఫ్రికా చేతుల్లో భారత్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్థాన్ దాదాపు వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించదనే చెప్పాలి.
కానీ.. కొన్ని సమీకరణాల ప్రకారం ఇంకా పాక్‌కు సెమీస్ అవకాశం ఉన్నా.. అదంత సులవు కాదు. పాక్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలవాలి. టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి. కానీ.. భారత్ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేతో ఆడుతుంది. ఏదో సంచలనం జరిగితే తప్పా.. ఈ రెండు మ్యాచ్‌లను భారత్ గెలవడం ఖాయం. ఈ రెండు మ్యాచ్‌లు భారత్ గెలిస్తే.. సెమీస్ చేరుతుంది. అలాగే సౌతాఫ్రికాకు సెమీస్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా.. పాకిస్థాన్ ఇంటికెళ్లడం పక్కాగా కనిపిస్తుంది. అందుకే జొమాటో ఆ ట్వీట్ చేసింది.
order placed for home delivery of pak team
— zomato (@zomato) October 30, 2022
#TeamIndia fought hard but it was South Africa who won the match.
We will look to bounce back in our next game of the #T20WorldCup . 👍 👍
Scorecard ▶️ https://t.co/KBtNIk6J16 #INDvSA pic.twitter.com/Q6NGoZokuE
— BCCI (@BCCI) October 30, 2022