ఒక యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో.. జింబాబ్వే జట్టుకు అర్థమై ఉంటుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మంచి ప్రదర్శన కనబర్చిన జింబాబ్వేకు టోర్నీ ముగింపు సమయంలో మాత్రం కన్నీళ్లు తప్పలేదు. సూర్య సునామీలో కకావికలమైన జింబాబ్వే జట్టు.. భారీ ఓటమితో టోర్నీని ముగించింది. కనీసం పోరాడి ఓడినా.. ఒకింత ఆనందంతో స్వదేశానికి వెళ్లేది జింబాబ్వే జట్టు.. కానీ.. సూర్యకుమార్ యాదవ్ వారికి ఆ ఆనందం దక్కనివ్వలేదు. ఉగ్రరూపం దాల్చి.. చివరి ఐదు ఓవర్లలో శివతాండవం చేశాడు. జింబాబ్వే బౌలర్లను బెంబేలెత్తించి భయపెట్టాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ లాంటి జట్టుకు షాకిచ్చిన జట్టుకు అసలైన ఆటగాడు తగులుకుంటే ఎలా ఉంటుందో చూపించాడు.
సూర్య ఆడిన ఇన్నింగ్స్‌తో జింబాబ్వే పసికూన జట్టే అని మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. పాకిస్థాన్ లాంటి నిలకడలేని జట్లపై మాత్రమే జింబాబ్వే పాచికలు పారుతాయని.. టీమిండియా ముందు కాదని నిరూపించాడు. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్ములేపాడు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో సునామీ బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించి.. చివరి 30 బంతుల్లో 70 పైచిలుకు పరుగులు వచ్చేలా చేశాడు. చివరి ఒక్క ఓవర్‌లోనే టీమిండియా ఏకంగా 21 పరుగులు పిండుకుంది. ఈ తుఫాన్‌కు ముందే.. జింబాబ్వేకు బంగారంలాంటి అవకాశం వచ్చింది. నిజానికి ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు.
ముజారబానీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతికి స్కూప్ షాట్ ఆడబోయిన మిస్ అయ్యాడు. బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. బంతి సూర్య బ్యాట్‌కు చాలా క్లోజ్‌గా వెళ్లడంతో ముజారబానీ చేయాల వద్దా అన్నట్లు చిన్న అప్పీల్ చేశాడు. కానీ.. సూర్య కొడితే సిక్స్ వెళ్లాలి.. కానీ. కీపర్ చేతుల్లో పడిందంటే తగిలి ఉండదులే అన్నట్లు.. అప్పీల్‌ను మనస్ఫూర్తిగా చేయలేదు. కీపర్ కూడా ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. దీంతో అంపైర్ కూడా స్పందించలేదు. కానీ రీప్లేలో మాత్రం బంతి.. బ్యాట్‌కు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. సూర్య కొట్టుడికి స్టేడియంలోని ప్రేక్షకులు ఊగిపోతూ.. హర్షధ్వానాలు చేస్తుంటే.. జింబాబ్వే జట్టు మొత్తం అప్పటికే సూర్య సునామీలో అతలాకుతలం అయిపోయింది. ఆ షాక్‌లోనే ఉన్న వాళ్లు సూర్య అవుట్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. వారి అమాయకత్వంతో చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు పిండుకున్నాడు. లేదంటే.. టీమిండియా స్కోర్ 160 దగ్గరే ఆగిపోయేది.
Suryakumar Yadav 🇮🇳 61* off 25
+ Three of the most ridiculous cricket shots you’ll ever see to end the Indian innings 🤯 #T20WorldCup @BCCI pic.twitter.com/cd0lEDH52w
— Sam Tugwell (@samtugwell_15) November 6, 2022