సాధారంగా క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రేమికుల లవ్ ప్రపోజల్స్ చాలా జరుగుతూంటాయి. తాజాగా ఈ మ్యాచ్ లో సైతం ఓ లవ్ ప్రపోజల్ జరిగింది. అదీకాక కొంత మంది అభిమానులకు బాల్ తగిలి దెబ్బలు తగులుతుంటాయి. అవన్నీ ఒకెత్తు అయితే తాజాగా యజ్వేంద్ర చాహల్ కు చెందిన వీడియో మరో ఎత్తు. ఈ మ్యాచ్ లో ఆటగాళ్లకు వాటర్, కూల్ డ్రింక్స్ అందిస్తూ.. పెవిలియన్ దగ్గర ఉన్నాడు చాహల్. అయితే భారత జట్టు బౌలింగ్ చేస్తున్న క్రమంలో చాహల్ పెట్టిన పోజులు, చేసిన సైగలు నెట్టింట వైరల్ గా మారాయి.
యజ్వేంద్ర చాహల్.. టీమిండియాలో ఎంత కీలక ప్లేయరో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియాలో కీ ప్లేయర్. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక క్రికెట్ మ్యాచ్ ల విషయానికి వస్తే.. మైదానంలోకి వచ్చాడంటే చాలు ఇతర ఆటగాళ్లపై తనదైన సరదా సంభాషణలతో విరుచుకుపడుతుంటాడు. చాహల్ ఉన్నాడంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. ఇక మ్యాచ్ అనంతరం మైక్ పట్టుకుని గ్రౌండ్ లోకి దిగి యువ ఆటగాళ్లనే కాకుండా సీనియర్ ప్లేయర్స్ ను కూడా ఓ ఆటాడుకుంటాడు. ఇక ప్రాక్టీస్ సమయంలో నెట్స్ లో తను కూర్చునే విధానం కూడా నవ్వు తెప్పిస్తుంది. తాజాగా ఇండియా-నెదర్లాండ్స్ మ్యాచ్ లోకూడా తన ఫన్నీ పోజుతో నెట్టింట వైరల్ గా మారాడు.
ఇండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర కాళ్లు చాపి విష్ణుమూర్తి లాగా పడుకుని ఉన్నాడు చాహల్. అప్పుడే బిగ్ స్క్రీన్ పై చాహల్ కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా స్టేడియం మెుత్తం గట్టిగా అరుపులు, కేకలు. వాటిని గమనించిన చాహల్ ఆ స్క్రీన్ వైపు చూస్తూ.. నా మీద ఎందుకు భయ్యా ఫోకస్.. ఎవరైనా అమ్మాయిల మీద పెట్టు అన్నట్లుగా తన చేతులతో సైగ చేసి నవ్వుతాడు. ప్రస్తుతం చాహల్ చేసిన ఈ సైగలు ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే చాహల్ కు ఇలాంటివన్ని కొత్తేం కాదు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, బౌండరీ లైన్ దగ్గర ఉన్నప్పుడు రకరకాల ఫన్నీ స్టెప్పులతో నవ్విస్తుంటాడు. ఇక పాక్ తో మ్యాచ్ లో, ఈ మ్యాచ్ లో చాహల్ ఆడలేదు.
Yuzvendra Chahal again done viral meme pose today 🤣
Virat Kohli Rohit Cricket INR 3 INR 6 #goat #INDvsNED #Netherlands #India #BCCI #Chahal #win pic.twitter.com/ykzEN2ktVU
— Prithvi Teaching . Prithviraj Santra (@prithviteaching) October 27, 2022
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(53), విరాట్ కోహ్లీ 63*, సూర్యకుమార్ 51* పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమిండియాకు మంచి స్కోరును అందించారు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ను భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు. తన మెుదటి స్పెల్ లో రెండు ఓవర్లు వేసిన భువీ కనీసం ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ తీశాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువీ, అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు. దాంతో భారత్ 56 రన్స్ తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది.
Yuzi Chahal with his signature pose once again😎
📸: Disney + Hotstar pic.twitter.com/8SoUGumRw1
— CricTracker (@Cricketracker) October 27, 2022