మంచి, చెడు.. ఏదైనా సరే అది జరగడానికి ముందు కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఎడమ కన్ను అదరడం, అప్పుడు ఇప్పుడు ఒకేలా జరగడం లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ఈసారి భారత జట్టుకు మెండుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై పసికూన ఐర్లాండ్ గెలిచేసరికి ఈ కామెంట్స్ ఇంకాస్త ఎక్కువయ్యాయి. నెటిజన్లు కూడా దీనికి వంత పాడుతూ సోషల్ మీడయాలో పోస్టులు కూడా పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 19.2 ఓవర్లలో157 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఇంగ్లాండ్ 14.3 ఓవర్లలో 105/5 స్కోరు దగ్గర ఉండగా వర్షం పడింది. ఇక ఆడే ఛాన్స్ లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ ని విజేతగా ప్రకటించారు. దీంతో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ గెలిస్తే.. ఇండియా కప్ ఎలా కొడుతుందనే సందేహం మీకు వచ్చింది కదా!
సరిగ్గా 11 ఏళ్లకు ముందుకు వెళ్తే, అంటే 2011 వన్డే ప్రపంచకప్ లోనూ ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లోనూ ఐర్లాండ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ టోర్నీలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు.. కప్ కొట్టి విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతానికొస్తే.. రోహిత్ శర్మ సారథ్యంలో పాక్ జట్టుపై తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా టైటిల్ కొట్టేలా కనిపిస్తోంది. సూపర్-12 దశలోని మిగిలిన మ్యాచులు కూడా గెలవడం దాదాపు గ్యారంటీ. ఇవన్నీ చూస్తుంటే.. టీమిండియా కప్పు కొట్టడానికి సిగ్నల్స్ గట్టిగా కనిపిస్తున్నాయి! చూడాలి మరి భారత జట్టు చరిత్రని రిపీట్ చేస్తుందేమో?
Will History repeat itself?#ENGvIRE #ENGvsIRE #VuratKohli #T20WorldCup #Cricket pic.twitter.com/nqgoarY1nD
— ScoresNow (@scoresnow_in) October 26, 2022
Wishing Team India all the luck for the T20 World Cup. Let’s go. 🇮🇳💙 @BCCI pic.twitter.com/F2q8hpkNUA
— Kuldeep yadav (@imkuldeep18) October 23, 2022