టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మ్యాచ్ లో చాలా మంది క్రికెట్ అభిమానులు గమనించని మరో ముఖ్య విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ విషయానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటంటే పాక్ ప్లేయర్స్ భారత వికెట్ పడ్డ ప్రతీసారీ డైమండ్ ఆకారంలో చేతి వేళ్లు పెట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు ఆ గుర్తుకు అర్దం ఏమిటో? వారు అలా ఎందుకు పెట్టారో ఓ సారి పరిశీలిద్దాం.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో వికెట్ తీసిన ప్రతీ సారి బౌలర్లు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. వికెట్ తీశాక.. బ్రావో డ్యాన్స్ వేస్తే.. శ్రీశాంత్ బౌలర్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తాడు. ఇక నిన్న గాక మెున్న జరిగిన ఆసియా కప్ లో బంగ్లా క్రికెటర్లు, శ్రీలంక క్రికెటర్లు నాగిని డ్యాన్స్ తో తమ సెలబ్రేషన్స్ ను చేసుకున్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ బౌలర్లు వికెట్ తీసిన ప్రతీసారి వింత గుర్తుతో ఆశ్చర్యానికి గురిచేశారు. చేతివేళ్లు డైమండ్ లా పెట్టి గాల్లోకి చూపుతూ.. తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ గుర్తుకు అర్దం ఏంటా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గుర్తుకు మూడు అర్దాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి:
సాధారణంగా మనం దేన్నైనా గురి చూసి కొట్టడానికి రాయిని ఉపయోగిస్తాం. అలాగే పాక్ బౌలర్లందరూ కూడా వికెట్ టు వికెట్ బంతులు వెయ్యాలి, ఫీల్డర్లు కూడా డైరెక్ట్ గా వికెట్లకే బాల్ విసరాలి అన్న ప్లాన్ తో మైదానంలోకి దిగినట్లు కనిపిస్తోంది. అందుకే వికెట్ పడ్డ ప్రతీసారి తమ ప్లాన్ ప్రకారంమే ఆ గుర్తును పైకి చూపారని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సమకాలీన క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు ఉన్న జట్టు పాకిస్థాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. షాహీన్ షా అఫ్రీది, హారీస్ రౌఫ్ లాంటి బౌలర్లు మెరుపు వేగంతో బంతులు విసరడంలో సిద్దహస్తులు. అలాంటి బంతులు విసరాలి అనే వ్యూహంతోనే బరిలోకి దిగినట్లు అర్దం అవుతోంది. వారు అనుకున్నట్లే మెుదట్లో మెరుపు బంతులతో టాపార్డర్ ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. దాంతో వారి వ్యూహం ఫలిస్తోంది అనే సంకేతాన్ని ఈ గుర్తు ద్వారా తెలియజేశారు.
Everything is fine but what’s with these signs vro? Whole team be doing it 😭👀 pic.twitter.com/t8o5hAvJg3
— 🕊 (@HeyitsRabea) October 24, 2022
హాలీవుడ్ స్టార్ ‘ది రాక్’ ప్రధాన పాత్రలో.. DC కామిక్స్ నుంచి వచ్చిన భారీ చిత్రం ‘బ్లాక్ ఆడం’. పాక్ ప్లేయర్లు పెట్టిన డైమండ్ గుర్తుకు ఈ సినిమాలో అద్భుత శక్తులకు మధ్య సంబంధం ఉంది. అద్భత శక్తులను మెరుపులతో చూపడం మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఏదో ఒక అద్భుత శక్తి తమకు సహకరిస్తుంది అన్న నమ్మకంతోనే వారు ఈ విధంగా చేతివేళ్లు పెట్టి ఉంటారు అనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ గుర్తులకు సంబంధించి ఎలాంటి సమాచారన్ని పాక్ ప్లేయర్లు బయటపెట్టలేదు.
ఏదిఏమైనప్పటికీ కింగ్ విరాట్ కోహ్లీ ధమాకా ఇన్నింగ్స్ ముందు పాక్ ప్లేయర్ల కుప్పిగంతులు, వారి సీక్రెట్ గుర్తులు ఏమాత్రం పనిచేయలేదు. వారి బౌలింగ్ ను కోహ్లీ సమర్ధవంతగా ఎదుర్కొంటూ.. టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధించలేదు కాబట్టి.. ఈ గుర్తు పెద్దగా వెలుగులోకి రాలేదు. ఒక వేళ పాక్ గనక ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే! వారి సీక్రెట్ సింబల్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Illuminati? https://t.co/b4JEXztWOo
— 🕊 (@HeyitsRabea) October 23, 2022