సెమీస్‌లో టీమిండియా బొక్కాబోర్లా పడింది. సూపర్ 12లో 4 విజయాలతో సత్తా చాటిన రోహిత్ సేన.. కీలక సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. అసలు ఏ మాత్రం పసలేని బౌలింగ్‌ను ఇంగ్లండ్ ఓపెనర్లు చెడుగుడు ఆడుకున్నారు. దీంతో 15 ఏళ్ల నిరీక్షణకు ఈ వరల్డ్ కప్‌కు తెరపడుతుందని భావించిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. టోర్నీ ఆరంభం నుంచి చెప్పుకుంటున్నట్లు టీమిండియా బౌలింగ్ ఎటాక్ వీక్‌గా ఉందనే విషయం సెమీస్‌తో తేటతెల్లమైంది. సూపర్ 12లో తొలి మ్యాచ్‌ను కోహ్లీ గెలిపిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లపై ఎలాగోలా నెట్టుకొచ్చిన టీమిండియా.. గ్రూప్‌లో ఒకే ఒక బలమైన ప్రత్యర్థి సౌతాఫ్రికా చేతిలో ఓడింది. ఇక సెమీస్‌లో ఇంగ్లండ్ భీకరమైన బ్యాటింగ్ ఉన్న జట్టు ముందు టీమిండియా బౌలింగ్‌లో ఏ మాత్రం పసలేదని తేలిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 168 పరుగులు చేసింది. మరోసారి కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ ఓపెనింగ్ దారుణంగా విఫలమైంది. చిన్న జట్లపై హాఫ్ సెంచరీలు కొట్టిన కేఎల్ రాహుల్ మరోసారి 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అప్పుడప్పుడూ మెరిసే సూర్య సెమీస్‌లో విఫలం అయ్యాడు. కానీ.. పాండ్యా అద్భుతంగా ఆడటం.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియాకు మంచి స్కోర్ వచ్చిందనే చెప్పాలి. అడిలైడ్ పిచ్‌పై 168 పరుగులు మంచి ఫైటింగ్ టార్గెట్ కానీ.. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
ఇక సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు చాలా నిరాశగా మారింది. మేం బ్యాక్‌ఎండ్‌లో బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ.. బౌలింగ్ స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రోజును మా రోజుగా మార్చుకోలేకపోయాం. నాటౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని హ్యాండిల్ చేయడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. జట్టులోని వారందరికి ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో అనుభవం ఉంది. ఐపీఎల్‌లో అందురూ ఒత్తిడిని ఎదుర్కొని తట్టుకున్న వాళ్లే. కానీ.. నిజానికి ఇంగ్లండ్ ఓపెనర్లకు క్రిడిట్ ఇవ్వాలి. వాళ్లు అద్భుతంగా ఆడారు. మేమిచ్చిన టార్గెట్‌ను డిఫెండ్ చేస్తాం అనుకున్నాం. కానీ.. మా ప్రణాళికలను ఈ రోజు సక్రమంగా అమలు పర్చలేకపోయాం.’ అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో బాగానే బ్యాటింగ్ చేశాం అనే రోహిత్ కామెంట్‌పై క్రికెట్ అభిమానుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
కాగా.. ఈ వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ దాదాపు విఫలం అయ్యాడనే చెప్పాలి. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో కేవలం నెదర్లాండ్స్‌పై మాత్రమే రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌పై కూడా 28 బంతులు ఆడిన రోహిత్ కేవలం 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గానూ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఆడించకపోవడం కెప్టెన్‌గా రోహిత్ చేసిన అతి పెద్ద పొరపాటని చెప్పవచ్చు. అలాగే దినేష్ కార్తీక్‌కు భారీగా అవకాశాలు ఇచ్చి.. కీలకమైన సెమీస్‌లో మాత్రం పంత్‌ను ఆడించాడు. అలాగే.. తన ఓపెనింగ్ పార్టనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలం అవుతున్నా.. జట్టుకు నష్టం జరుగుతున్నా.. అతన్నే కొనసాగించాడు.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
Scorecard ▶️ https://t.co/5t1NQ2iUeJ #T20WorldCup | #INDvENG pic.twitter.com/5qPAiu8LcL
— BCCI (@BCCI) November 10, 2022