భారత్-పాక్ మ్యాచ్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ దాయాదుల పోరులో తమ టీమ్ విజయం సాధిస్తుందంటే.. కాదు మా టీమే గెలుస్తుందని ఇరుదేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వార్‌కు తెరలేపారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా 23న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ 2021లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా గట్టిపట్టుదలతో ఉంది. అలాగే అదే టెంపోను కొనసాగించాలని బాబర్ అజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ టీమ్‌కు కూడా భావిస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఆసియా కప్ 2022లో భారత్-పాక్ జట్లు రెండు మ్యాచ్‌ల్లో తలపడి.. చెరో మ్యాచ్ గెలిచాయి. కాగా.. వరల్డ్ కప్ వేదికలపై భారత్‌కు పాక్‌పై తిరుగులేని ఆధిపత్యం ఉంది. దాన్ని కొనసాగించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ భావిస్తున్నాడు.
మరి ఆదివారం జరిగే పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందనే విషయంపై ఎవరి అంచనాలు వారు వెల్లడిస్తున్నా.. టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతంగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. బాబర్ అజమ్ బ్యాటింగ్ చేసేటప్పుటు చూస్తుంటే.. ఎంతో కామ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తుందని అన్నాడు. బాబర్ బ్యాటింగ్ చూస్తుంటే మజా వస్తుందని.. గతంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే వచ్చే ఫీల్ ఇప్పుడు బాబర్ బ్యాటింగ్‌లోనూ కనిపిస్తుంది అని సెహ్వాగ్ అన్నాడు. అలాగే.. టీ20 వరల్డ్ కప్ 2022లో బాబర్ అజమ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. మరి ఈ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను సెహ్వాగ్ పక్కనపెట్టేశాడు.
కాగా.. ఆదివారం జరగబోయే మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఇలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాక్ బ్యాటర్ నవాజ్ కొట్టిన భారీ షాట్ నేరుగా వెళ్లి మరో బ్యాటర్ షాన్ మసూద్ తలకు బలంగా తాకింది. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే.. పాక్ స్టార్‌పేసర్ షాహీన్ అఫ్రిదీ మంచి రిథమ్‌లో ఉంటడం పాక్‌కు కలిసొచ్చే అంశం. అఫ్రిదీ ఒక్కడ్ని సమర్థంగా ఎదుర్కొని, పాక్ ఓపెనర్లు బాబర్ అజమ్, రిజ్వాన్‌లను త్వరగా అవుట్ చేయగలిగితే.. టీమిండియాకు విజయం పెద్ద కష్టం కాదని క్రికెట్ అభిమానులతో పాటు నిపుణులు సైతం భావిస్తున్నారు.
Virender Sehwag — “Babar Azam will end up as top run scorers in T20 WorldCup 2022. Babar Azam is batting brilliantly. It feels great to watch him bat just like you feel at peace while seeing Virat Kohli’s batting. You feel happy watching Babar Azam bat aswell.” #T20WorldCup
— Arfa Feroz Zake (@ArfaSays_) October 21, 2022
Michael Vaughan and Virender Sehwag have backed Babar Azam to be the leading run-scorer of the #T20WorldCup https://t.co/bDTLYjRQcC
— CricWick (@CricWick) October 20, 2022