విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? అంటే బ్యాటింగ్ అని, స్టైలిష్ షాట్స్ అని చాలా చెబుతారు. వీటన్నింటి కంటే అతడి ఫిట్ నెస్ లెవల్స్ ని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఫిట్టెస్ట్ క్రికెటర్ అనగానే కోహ్లీ పేరే టాప్ లో ఉంటుంది. ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడో.. అంత కంటే ఎక్కువగా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తూ ఉంటాడు. కోహ్లీ ఫిట్ నెస్ అనేది పెద్ద సీక్రెట్ ఏం కాదు. తన వర్కౌట్ వీడియోలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ ని తాజాగా కోహ్లీ బయటపెట్టాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గత కొన్నాళ్లలో ఫామ్ కోల్పోయాడు. దీంతో ప్రతి ఒక్కరూ అతడిని విమర్శించడం మొదలుపెట్టారు. బ్యాటింగే సరిగా చేయలేకపోతున్నాడు. జట్టులో ఉంచడం ఎందుకు దండగ అని కూడా అన్నారు! వాటిని భరిస్తూనే వచ్చిన కోహ్లీ.. రీసెంట్ గా జరిగిన ఆసియాకప్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో దుమ్మురేపుతున్నాడు. ఐదు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి పాత కోహ్లీని గుర్తుచేశాడు.
ఇక రీసెంట్ గా 34వ పుట్టినరోజు జరుపుకొన్న కోహ్లీని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘నా ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు అనుకుంటాను. ఇక బరువు అంటారా గత ఎనిమిదేళ్లలో 74.5 నుంచి 75 కిలోల మధ్యలోనే ఉన్నాను’ అని చెప్పాడు. 8 ఏళ్ల నుంచి ఒకే బరువు మెంటైన్ చేయడం ఎలా సాధ్యమైందని అభిమానులు కామెంట్స్ చెబుతున్నారు. ఈ విషయంలో మాత్రం విరాట్ ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిందేనని మాట్లాడుకుంటున్నారు.
అయితే కోహ్లీ ఇన్నేళ్లపాటు అదే బరువు మెంటైన్ చేయడం వెనక చాలా కష్టం ఉంది. నాన్ వెజ్ అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ.. బాడీ షేప్ లో ఉండటం కోసం దాన్ని పూర్తిగా దూరం పెట్టాడు. ట్రైనర్స్ చెప్పిన ప్రకారం తింటూ వచ్చాడు. ఇష్టమైన ఫుడ్స్ ఎంత టెంప్ట్ చేసినా సరే ఆట కోసం అవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఇలా ఫుడ్ విషయంలో ఎన్నో త్యాగాలు చేశాడు కాబట్టే ఒకే బరువుతో ఎనిమిదేళ్లుగా ఉన్నాడు. ఫీల్డింగ్, వికెట్ల మధ్య రన్నింగ్ లో మిగతా క్రికెటర్లకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఇలా కోహ్లీ రన్నింగ్ చేస్తుంటే మనకు ఫుల్ హ్యాపీగా అనిపించొచ్చు కానీ దాని వెనక ఎంతో కష్టం ఉందని కూడా అర్ధం చేసుకోవాలి.