ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఇప్పుడు సెమీస్ సెగ మొదలైంది. రేపు(బుధవారం) న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తొలి సెమీ ఫైనల్లో తలపడనుంది. అలాగే.. 10న ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో సెమీస్‌లో అమీతుమి తేల్చుకోనుంది. ఈ కీలకమైన సెమీస్‌లకు ముందు నాలుగు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఎలాగైనా సెమీస్‌లో గెలిచి.. ఫైనల్ పోరుకు సిద్దమవ్వలాని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఈ నాలుగు జట్ల ఆటగాళ్లు నెట్ సెషన్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండటం శుభసూచికం. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి వస్తే.. టీమిండియాను అడ్డుకోవడం ఇంగ్లండ్‌కు సాధ్యం కాదు.
కానీ.. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే.. కొంతసేపటికే కోలుకున్న రోహిత్.. మళ్లీ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. అయితే.. విరాట్ కోహ్లీ మాత్రం నెట్స్‌లో రెచ్చిపోతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. తన బ్యాటింగ్‌కు మరింత పదునుపెడుతున్నాడు. ఈ టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలతో ఇప్పటికే 246 పరుగులతో కోహ్లీ టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక సెమీస్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి టీమిండియాను సెమీస్ చేర్చే పట్టుదలతో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో కోహ్లీ నెట్స్‌లో ఆడుతున్న షాట్లు చూసిన అభిమానులు.. ఒక స్పెషల్ ట్రీట్‌ను కోరుకుంటున్నారు. సిక్సులు కొట్టడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ.. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సుల రికార్డును రిపీట్ చేయాలని ఆశిస్తున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి.. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. అరుదైన రికార్డను తన పేరిట లిఖించుకున్నాడు. యువీ ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో అలా నిలిచిపోయింది. అలాంటి మరో అరుదైన ఫీట్‌ను కోహ్లీ లేదా సూర్యకుమార్ యాదవ్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Enjoying the process. 🙌♥️
.#𝗩𝗜deo pic.twitter.com/DmTpAarmzi— Virat Kohli (@imVkohli) November 8, 2022