‘రాణించనపుడు.. ఆడించడం ఎందుకు?’ సరిగ్గా రెండు నెలల క్రితం టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ గురుంచి విమర్శకులే కాదు.. సగటు క్రికెట్ అభిమానులు కూడా అన్న మాటలివి. అలాంటి విరాట్ కోహ్లీ, ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు కూడా కోహ్లీనే. ఈ నేపథ్యంలో అతని పోరాట పటిమను గుర్తించిన ఐసీసీ, ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కోసం ఎంపికచేసింది. అయితే ఇక్కడ కోహ్లీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో 82 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ, ఆపై నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులోనూ 62 పరుగులు చేశాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా మ్యాచులో విఫలమైనా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులోనూ 64 పరుగులతో రాణించి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ నాలుగు మ్యాచల్లో కోహ్లీ 205 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కోసం ఎంపికచేసింది. ఐసీసీ.. ఈ అవార్డును ప్రవేశపెట్టిన తరువాత కోహ్లీ నామినేట్ కావడం ఇదే తొలిసారి.
Virat Kohli in T20 World Cups hits different 👑💥
📸: Disney+Hotstar#T20WorldCup pic.twitter.com/mqFfc2hiSJ
— CricTracker (@Cricketracker) November 3, 2022
ఈ అవార్డు కోసం ఐసీసీ, విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా పేర్లను కూడా నామినేట్ చేసింది. అక్టోబర్‌లో భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. గువాహటి వేదికగా జరిగిన టీ20 మ్యాచులో 79 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఇక జింబాబ్వే విజయాల్లో ఆ జట్టు ఆల్ రౌండర్ సికందర్ రజా కీలక పాత్ర పోషిస్తోన్నాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా రెండింటిలో తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కు ఎంపికయ్యారు. త్వరలోనే ఈ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారన్నది ఐసీసీ ప్రకటించనుంది.
For the first time Virat Kohli nominated for the ICC Player of the month award. pic.twitter.com/b3k0UAFXRi
— CricketMAN2 (@ImTanujSingh) November 3, 2022