టీమిండియా వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. ఇప్పటికే వరకు మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ చేసిన పరుగులు మొత్తం కలిపి 22 మాత్రమే. పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 4 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. నెదర్లాండ్స్‌పై 9, సౌతాఫ్రికాపై 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ బ్యాడ్ ఫామ్ జట్టు బ్యాటింగ్ లైనప్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాహుల్ స్లో బ్యాటింగ్ అప్రోచ్, డిఫెన్సివ్ మూడ్ బ్యాటింగ్‌తో అతనితో పాటు మరో ఎండ్‌లో రోహిత్ శర్మపై కూడా ఒత్తిడి పెంచుతోంది. పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ ఎక్కువగా డాట్స్ ఆడుతుండటంతో వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో రోహిత్ టూ అగ్రెసివ్‌గా ఆడి వికెట్ సమర్పించుకుంటున్నాడు.
కేఎల్ రాహుల్ వెంటనే అవుట్ అవ్వడంతో పవర్‌ప్లేలో టీమిండియా భారీగా పరుగులు రాబట్టలేకపోతోంది. దీంతో వన్‌డౌన్‌లో వచ్చే విరాట్ కోహ్లీ కూడా ఆరంభంలో నిదానంగా ఆడి.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు కోహ్లీ కూడా అవుట్ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో స్పష్టమైంది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే హాఫ్‌సెంచరీతో టీమిండియా ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. కాగా.. కేఎల్ రాహుల్ వైఫల్యానికి ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లే కారణమనే వాదన ఉంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై పేస్, బౌన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. పేస్‌తో రాహుల్ ఇబ్బంది లేదు కానీ.. బౌన్స్‌కు కొంత ఇబ్బంది పడుతున్నట్లు అర్థం అవుతోంది.
అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కేఎల్ రాహుల్.. టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్, ఆస్ట్రేలియా పిచ్‌లంటే చాలు చెలరేగిపోయే కింగ్ కోహ్లీ వద్ద విలువైన సలహాలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో కేఎల్ రాహుల్‌కు విరాట్ కోహ్లీ వివరిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు అడిలైట్‌లో నెట్ సెషన్స్‌లో పాల్గొన్నారు. ఈ నెట్ సెషన్స్‌లో కేఎల్ రాహుల్ కోహ్లీ వద్ద కోచింగ్ తీసుకుంటూ కనిపించాడు. తన సహచర ఆటగాడిని ఫామ్‌లో తెచ్చేందుకు కోహ్లీ తన టెక్నిక్స్, టిప్స్‌ను రాహుల్‌కు చెప్పాడు. కాగా.. ఆస్ట్రేలియా పిచ్‌లపై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 82, నెదర్లాండ్స్‌పై 62 పరుగులు చేసి సత్తా చాటాడు కోహ్లీ. ఆదివారం సౌతాఫ్రికాపై 12 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
Virat Kohli in a lengthy conversation with KL Rahul ahead of the Bangladesh match. The gesturing suggests the chat is about the rising ball outside off. pic.twitter.com/613epHRJmJ
— Nikhil Naz (@NikhilNaz) November 1, 2022
Virat Kohli advising KL Rahul on his feet and batting stance.
📹: @pdevendra pic.twitter.com/wQcvFiaXHa
— Express Sports (@IExpressSports) November 1, 2022