టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అతని ఆటను చూసేందుకు పిల్లల నుంచి పెద్దల దాగా అంతా ఇష్టపడతారు. క్రికెట్‌ను అభిమానించే వారికి, కెరీర్‌గా ఎంచుకునే వారికి విరాట్ కోహ్లీ ఒక రోల్ మోడల్, ఒక ఇన్సిపిరేషన్. కోహ్లీని అభిమానించే వారిలో కొంతమంది ప్రత్యేకమైన ఫ్యాన్స్ సైతం ఉన్నారు. వారిలో మరింత ప్రత్యేకమైన ఫ్యాన్ ఎలీ. ఇంగ్లండ్‌కు చెందిన ఎలీకి కళ్లు కనిపించవు. అంధురాలైన ఆమెకు విరాట్ కోహ్లీ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అతనే ఆమెకు స్ఫూర్తి. నిజానికి ఎలీకి టెన్నిస్ అంటే బాగా ఇష్టం. అలాగే కోహ్లీకి కూడా టెన్నిస్ అంటే ఇష్టమనే విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న ఎలీ.. అతని నుంచి స్ఫూర్తి పొందింది.
అక్కడి నుంచి విరాట్‌పై అమితమైన అభిమానాన్ని పెంచేసుకుంది. విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడో ఆమెకు తెలియదు. కోహ్లీ ఎలా ఆడతాడో ఆమెకు తెలియదు. కానీ.. కోహ్లీ కోసం వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ అరుదైన అభిమాని గురించి తెలుసుకున్న కోహ్లీ సైతం ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి అభిమాని ఉండటం.. తానెంతో పుణ్యం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆమెకు గతంలో తన జెర్సీ, ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను సైతం ఇచ్చాడు. కోహ్లీ ఇచ్చిన జెర్సీ ధరించి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఎలీని ఒక జర్నలిస్ట్ మాట్లాడించగా.. కోహ్లీపై తన ప్రేమను వెల్లడించింది ఎలీ.
కోహ్లీ అంటే తనకెంతో ఇష్టమని.. అతను తనను ఎంతగానో ఇన్స్‌పైర్ చేశాడని చెప్పింది. ఐ లవ్ విరాట్ కోహ్లీ అంటూ కోహ్లీ పట్ల తన ప్రేమను వ్యక్త పరిచింది. అయితే.. ఎలీకి కోహ్లీపై ఉన్న అభిమానాన్ని ఏనాడు అడ్డుచెప్పని ఎలీ తల్లి.. ఆమెను మ్యాచ్ కోసం స్టేడియానికి తీసుకోస్తుంది. పైగా.. ఎలీ తల్లి ఇంగ్లండ్‌ను సపోర్ట్ చేస్తుండగా.. ఎలీ మాత్రం కోహ్లీ కోసం ఇండియాను సపోర్ట్ చేస్తుంది. ఈ విషయంలోనూ ఎలీ తల్లికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎలీ అభిప్రాయాన్ని కాదనే హక్కు తనకు లేదని, తాను ఇంగ్లండ్‌కు మద్దతు తెలిపితే.. కోహ్లీ కోసం ఎలీ ఇండియాను సపోర్ట్ చేస్తుంది. అది తన ఇష్టం అంటూ ఎలీ తల్లి పేర్కొన్నారు. అయితే.. కోహ్లీకి ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఉండటంపై కోహ్లీ ఫ్యాన్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోను షేర్ చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Virat Kohli is a true inspiration, you can see this heart touching story. Link: https://t.co/Cuc5Yv0oyhpic.twitter.com/DvrhYFHWDD
— Johns. (@CricCrazyJohns) November 7, 2022