ఓడలు బళ్లు కావడం.. బళ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో.. ఎందుకంటే విజయాలు దక్కించుకోవడం కష్టమే. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అలా ఒకప్పుడు టీ20 ఫార్మాట్ లో అద్భుతమైన జట్టు అనిపించుకున్న ఇది.. ఇప్పుడు టోర్నీకే అర్హత సాధించలేకపోయింది. పసికూన జట్లపై కూడా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. నెటిజన్స్ అయితే అయ్యే.. విండీస్ జట్టుకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని నిట్టూర్పులు వదిలుతున్నారు. అసలు వెస్టిండీస్ జట్టుకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఎందుకిలా తయారైంది? ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 పేరు చెప్పగానే మనకు విండీస్ క్రికెటర్లు గేల్, పొలార్డ్, రసెల్, నరైన్ లాంటి వాళ్లే గుర్తొస్తారు. ఎందుకంటే ఈ ఫార్మాట్ కోసమే పుట్టారా అనేంత కసితో ఆడతారు.
ఐపీఎల్, బిగ్ బాష్, కరీబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా టోర్నీ ఏదైనా సరే.. తమ శక్తి కంటే ఎక్కువ బయటపెడతారు. సిక్సులు, ఫోర్లు కొట్టడమే కాదు.. అద్భుతమైన ఫీల్డింగ్ తోనూ మెరుపులు మెరిపిస్తారు. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే.. టీ20 లీగ్స్ శక్తికి మించి ప్రదర్శన చేసే విండీస్ క్రికెటర్లకు.. దేశం తరఫున ఆడాల్సి వచ్చేసరికి మాత్రం ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంది! ఇది మేం ఏదో కల్పించి చెబుతున్న మాట కాదు. గత కొన్నేళ్లుగా విండీస్ జట్టు ప్రదర్శన చూస్తే మీకే క్లియర్ గా విషయం అర్ధమైపోతుంది. ఎందుకంటే ప్రతి రెండేళ్లకు ఓసారి జరిగే టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పాల్గొనేది. అలా 2012, 2016లో విజేతగానూ నిలిచింది. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ ఏడుసార్లు జరిగితే.. విండీస్ మాత్రం రెండుసార్లు కప్పు కొట్టింది. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్టు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.
ఇక ఈసారి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. అయితే సూపర్ 12 మొదలవడానికి ముందు.. గ్రూప్ మ్యాచులు జరిగాయి. పాయింట్ల ఎక్కువగా లేకపోవడంతో.. వెస్టిండీస్ జట్టు గ్రూప్ దశలో చిన్నజట్లతో పోటీపడింది. అద్భుతమైన క్రికెటర్లున్న విండీస్ జట్టు.. సూపర్-12 దశకు అర్హత సాధిస్తుందని అందరూ భావించారు. కానీ రియాలిటీలో జరిగింది వేరు. అక్టోబరు 17న స్కాట్లాండ్ జట్టు చేతిలో 42 పరుగుల తేడాతో విండీస్ ఓడిపోయింది. అక్టోబరు 19న జింబాబ్వేపై గెలిచింది. ఇక తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఐర్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో కనీసం గ్రూప్ స్టేజ్ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు.. ఎలా ఉండే వెస్టిండీస్ ఎలా తయారైందని మాట్లాడుకుంటున్నారు. టీ20 లీగ్స్ లో కాకుండా జాతీయ జట్టుకి ఆడేటప్పుడు సమష్టి ఆడితేనే విండీస్ జట్టు మళ్లీ గాడిలో పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన విండీస్.. ఈసారి సూపర్ 12కి క్వాలిఫై కాకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Ireland are through to the Super 12 🎉
A comprehensive performance in Hobart sees them knocking West Indies out of the tournament.#T20WorldCup |#IREvWI | 📝: https://t.co/LTVdRx1Xp2 pic.twitter.com/Fr3quaekYA
— T20 World Cup (@T20WorldCup) October 21, 2022