టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్ జట్టు పరిస్థితి చాలా దయనియంగా తయ్యారు అయ్యింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు తయ్యారు అయ్యింది. భారత్ తో గెలిచే మ్యాచ్ ఓడిపోవడం, పసికూన అయిన జింబాబ్వే చేతిలో 1 పరుగు తేడాతో పరాజయం పొందడతో.. పాకిస్థాన్ పై పాక్ మాజీ క్రికెటర్లే విమర్శలు గుప్పించారు. అదీ కాక పాక్ ఓటములకు ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ అని అక్తర్, వసీమ్ అక్రమ్ సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తాజాగా బాబర్ ని విమర్శించిన వారి జాబితాలో చేరిపోయాడు టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. బాబర్ అజామ్ ఓ స్వార్థపూరిత కెప్టెన్ అంటూ వర్ణిస్తూ.. జట్టు విజయం కోసం ఆడాలని సూచించాడు.
బాబర్ అజామ్.. స్థిరమైన బ్యాటింగ్ తో పాక్ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ క్రమంలోనే వరుస మ్యాచ్ ల్లో స్కోర్లు చేస్తు.. వరల్డ్ నెంబర్.1 బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆసియా కప్ నుంచి బాబర్ ఫామ్ ను కోల్పోయి తెగ ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో ఇంటా.. బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పాక్ మాజీ క్రికెటర్లే బాబర్ ను దుయ్యబడుతున్నారు. అతడి అనాలోచిన నిర్ణయాలే జట్టు ఓటములకు కారణమని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెదర్లాండ్స్ వర్సెస్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో కామెంటరీ సందర్భంగా బాబర్ పై నిప్పులు చెరిగాడు గంభీర్. అతడి పూర్ కెప్టెన్సీని ఏకీపారేశాడు.
బాబర్ ఫామ్ పై, అతడి తీరుపై గంభీర్ మాట్లాడుతూ..”నా అభిప్రాయం ప్రకారం బాబర్ అజామ్ ఓ స్వార్థపూరిత కెప్టెన్. తన వ్యక్తిగత రికార్డుల కోసం జట్టును బలి చేస్తున్నాడు. సారథిగా ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం పని చేయాలి గానీ నీ సొంత రికార్డుల కోసం కాదు” అంటూ ఫైర్ అయ్యాడు. మీరు అనుకున్నట్లు జరగక పోతే బ్యాటింగ్ ఆర్డర్ లో ఫఖర్ జామాన్ ను ముందు పంపి ఉండాలి కానీ మీరు ఆ పనిచేయలేదని గంభీర్ అన్నాడు. ఇది స్వార్థానికి నిలువెత్తు నిదర్శనం అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అదీ కాక రిజ్వాన్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించడం.. రికార్డులు కొల్లగొట్టడం చాలా సులువైన పనిగా గౌతమ్ పేర్కొన్నాడు. ఇప్పటికైన మేల్కొని జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆడాలని గంభీర్ బాబర్ కు సూచించాడు.
Former Indian cricketer @GautamGambhir has his say on Pakistani skipper @babarazam258 #Cricket #T20WorldCup #sports #CricketTwitter #T20worldcup22 #T20WC2022 #BabarAzam pic.twitter.com/6yJpX9284h
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) November 1, 2022