ఏ ఆటైనా సరే కెప్టెన్ అనేవాడు అంటే ముందుండి నడిపించాలి. ఒకవేళ అది కుదరకపోతే ఎవరు చెప్పక ముందే సైడ్ అయిపోవాలి. లేదంటే అత్యంత చెత్త ఫలితాలు వస్తాయి. ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకునే విషయంలో చురుగ్గా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చేజేతులా పరువు పోగొట్టుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ దక్షిణాఫ్రికా జట్టుని చూస్తే నిజంగా జాలేసింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్, టీమిండియాపై గెలిచి సెమీస్ అవకాశాల్ని మెరుగుపరుచుకుంది. కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ ఆ జట్టుని అంటిపెట్టుకుని ఉన్నట్లుంది. ఇక తర్వాతి మ్యాచ్ లో వర్షం పడటం వల్ల పాక్ జట్టు 33 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం చూపించింది. 13 పరుగుల తేడాతో సఫారీ జట్టుని ఓడించింది. దీంతో చేతి దాకా వచ్చిన సెమీస్ ఛాన్స్.. దక్షిణాఫ్రికాకు దూరమైంది. ఇదంతా జరగడానికి కారణం దురదృష్టం అయ్యిండొచ్చు. అంత కంటే మెయిన్ పాయింట్ బవుమా పూర్ కెప్టెన్సీ.
టీ20 ప్రపంచకప్ లో జరిగిన ఐదు మ్యాచ్ ల్లో 2, 2, 10, 36, 20 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్ గా కంటే బ్యాటర్ గానూ ఘోరంగా విఫలమయ్యాడు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 32 టీ20లాడిన బవుమా.. 635 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 116.08. చూడటానికి ఇది సాధారణంగా అనిపించినా సరే.. మిగతా బ్యాటర్లతో పోల్చుకుంటే చాలా తక్కువ స్ట్రైయిక్ రేట్. ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు బవుమాపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జట్టు స్వదేశానికి చేరుకున్న వెంటనే.. కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే బవుమాని కెప్టెన్ గా తొలిగించినప్పటికీ.. ఆటగాడిగా జట్టులో ఉంచొచ్చని సమాచారం. మిల్లర్ కెప్టెన్ అయ్యే ఛాన్సులు గట్టిగా కనిపిస్తాయి.
Under Temba Bavuma ‘s captaincy
SA lost to Ireland in an ODI for the first time
SA lost home ODI series against Bangladesh for first time
SA lost against Netherlands for first time
Failed to qualify for knock outs of both 2021 and 2022 T20 WC pic.twitter.com/WUoBU2lAoF
— Arnav Singh (@Arnavv43) November 6, 2022
Temba Bavuma scored just 70 runs in five innings at this #T20WorldCup 😬
👉 https://t.co/CtxC11b4wJ pic.twitter.com/sh1KSrb7yu
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2022
Bavuma the worst Captain i have ever watched.
Trying to adjust himself at opening slot. Failed to scores. Failed to Chase, Failed to take decisions.
I am even amazed why he is in the team.
For the reason they called #Chokers#SAvsNED #PAKvsZIM pic.twitter.com/S1z7AGObOb— Toseef RajpooT (@TsfRanaa) November 6, 2022