ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ ఊహకందని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. టోర్నీ తొలి మ్యాచ్ దగ్గర నుంచి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. గ్రూప్ -1లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, గ్రూప్ స్టేజీకే పరిమితం కాగా, వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్న గ్రూప్ -2లో అంతకుమించిన హై డ్రామా నడిచింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో ఓడి సౌతాఫ్రికా ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాక్ అనూహ్యంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
టోర్నీ తొలి మ్యాచులో భారత్ చేతిలో ఓడిన పాక్, ఆ తరువాత జింబాబ్వే చేతిలోనూ ఓడింది. ఇంతటితో పాక్ కథ ముగిసిందనుకున్నారు అందరూ. అయితే అందరి అంచనాలు తలక్రిందలు అవుతూ పాక్ సెమీస్ కు దూసుకెళ్లింది. గెలవాల్సిన మ్యాచును సౌతాఫ్రికా చేజేతులా పోగొట్టుకోవడం పాక్ కు కలిసొచ్చింది. ఆ తరువాత బంగ్లాదేశ్ మ్యాచులో ఏకపక్షంగా విజయం సాధించి గ్రూప్-2లో అగ్రస్థానాన కూర్చుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్మల్ హసన్ శాంతో 54 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్ 20, ఆసీఫ్ హుస్సేన్ 24 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు, హారీష్ రవుఫ్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.
💥 Dutch delight for the Netherlands
😢 Dismay for South Africa as semi-final dream over
🤔 Who is in the box seat to qualify from Group 2?All the talking points from a thrilling #SAvNED contest at #T20WorldCup in Adelaide 👇https://t.co/c1irG4ty5P
— T20 World Cup (@T20WorldCup) November 6, 2022
అనంతరం 128 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. స్వల్ప లక్ష్యం కావడంతో పాక్ బ్యాటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. బాబర్ ఆజాం (32), మహమ్మద్ రిజ్వాన్ (25), మహమ్మద్ హరిష్ (31), షాన్ మసూద్ (22 ) రాణించారు. బంగ్లా బౌలర్లలో నసూమ్ అహ్మద్, షాకిబ్ అల్ హసన్, ముస్తఫిజుర్ రహ్మాన్, ఇపాదత్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో పాక్ సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ కాగా, సెమీస్ పోరులో న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ నవంబర్ 9న మెల్ బోర్న్ వేదికగా జరగనుంది.
A five-wicket win to secure a spot in the semi-finals 👏
Well done, boys! 🙌#WeHaveWeWill | #T20WorldCup | #PAKvBAN pic.twitter.com/2sOpviBsad
— Pakistan Cricket (@TheRealPCB) November 6, 2022
Pakistan is now on the top of the table. pic.twitter.com/4W0JEXsqo3
— Ihtisham Ul Haq (@iihtishamm) November 6, 2022