అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. లేదంటే మొత్తం సీనే మారిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. ఎందుకంటే టీమిండియాతో గెలవాల్సిన మ్యాచ్ ని చివరి వరకు తెచ్చుకున్నారు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ వల్ల ఓడిపోయారు. ఇలాంటి టైంలోనే అయినా సరే జాగ్రత్త పడాలి కదా. కానీ అది చేయలేదు. పసికూన జింబాబ్వేని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు టోర్నీ నుంచి పూర్తిగా ఔటయ్యే ప్రమాదంలో పడిపోయారు. అయితే పాక్ జట్టుకు, జింబాబ్వే ఫీల్డర్లు కొన్ని తప్పిదాలు చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… పెర్త్ వేదికగా గురువారం సాయంత్రం పాక్-జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక టార్గెట్ తక్కువే కాబట్టి పాక్ గెలిచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో జరిగింది వేరు. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే గెలిచింది.
అయితే ఈ మ్యాచ్ లోని పాక్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో జింబాబ్వే ఫీల్డర్లు తప్పిదాలు చేశారు. బౌండరీ వైపు వెళ్తున్న ఓ బంతిని, లైన్ తాకకుండా జాంగ్వే చాలా కష్టపడి ఆపాడు. ఆ వెనకే వచ్చిన వెస్లీ మద్వరే చాలా కేర్ లెస్ గా వ్యవహరించాడు. బౌండరీ గీతపై కాలుపెట్టి మరీ బంతిని అందుకున్నాడు. దీంతో పాక్ ఖాతాలో నాలుగు పరుగులు జోడించారు. అయితే జింబాబ్వే ఫీల్డర్లు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ.. పాక్ బ్యాటర్లు ఈ ఛాన్సులను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మ్యాచ్ లో ఓడిపోయారు. దీని వల్ల పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
He ruined the efforts of Jongwe😭 pic.twitter.com/WvMOdJ1r1N
— Team Shaheen Afridi (@Team_Shaheen_) October 27, 2022
— MINI BUS 2022 (@minibus2022) October 27, 2022