టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకు తిప్పలు తప్పడం లేదు. తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. చెప్పాలంటే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 4 వికెట్లు పడేసరికి అందరూ పాక్ దే గెలుపు అని ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. దాయాది జట్టు అదే అనుకుని ఉంటుంది. అలాంటి టైంలో పాత కోహ్లీ బయటకొట్టాడు. ఛేజింగ్ లో సింహంలా పోరాడి.. భారత్ కి ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత పాక్, జింబాబ్వేతో తలపడనుంది. మ్యాచ్ ఈ రోజే జరగనుంది. ఇప్పుడు ఈ పోరు కంటే ముందు ఇరుదేశాల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరుజట్లు చెరో పాయింట్ ని పంచుకున్నాయి. ఇక తాజా మ్యాచ్ లో జింబాబ్వేని ఓడించడం పాక్ కి ఎంతో అవసరం. బలం పరంగా చూసుకుంటే పాక్ సులువుగానే గెలిచేస్తుంది. కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటి ఈ మ్యాచ్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాదు కాదు జింబాబ్వే అభిమానులు అలా మార్చేశారు. పాక్ జట్టుపై ఎలాగైనా సరే తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు. 2016లో పాక్, మిస్టర్ బీన్ కు బదులు ఫేక్ బీన్ ని జింబాబ్వేకి పంపడమే ఇందుకు కారణమని అంటున్నారు. ‘రివేంజ్ తప్పదు, వర్షమే మిమ్మల్ని కాపాడాలి’ అని ఎంగుగి చసురా అనే జింబాబ్వే ఫ్యాన్ ట్వీట్ చేశాడు.
ఇక ఫేక్ మిస్టర్ బీన్ గురించి మాట్లాడుకుంటే.. అసిఫ్ మహమ్మద్ అనే వ్యక్తి చూడటానికి మిస్టర్ బీన్ రోవాన్ అట్కిన్ సన్ లా ఉంటాడు. 2016లో అసిఫ్ జింబాబ్వే వెళ్లాడు. అక్కడ రోడ్ షోలో పాల్గొనడంతో పాటు కామెడీ నైట్స్ కి కూడా అటెండ్ అయ్యాడు. హరారే అగ్రికల్చర్ షోలోనూ అతడూ పాల్గొన్నాడు. అయితే ఇదే అసిఫ్.. మిస్టర్ బీన్ ని అనుకరిస్తూ.. జింబాబ్వే ప్రజల డబ్బు దోచుకున్నాడని ఎంగుగి చాసురా.. ఓ పాక్ నెటిజన్ కి బదులిస్తూ అసలు చెప్పేశాడు. ప్రస్తుతం పాక్-జింబాబ్వే అభిమానుల మధ్య జరుగుతున్న ఈ చర్చంతా ఇంట్రెస్టింగ్ గా ఉండగా.. మిగతా దేశాల ప్రేక్షకులు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
Tommorow he will not show mercy on you gents because of tjat matter
— Ngugi Chasura (@mhanduwe0718061) October 26, 2022
As Zimbabweans we wont forgive you…you once gave us that Fraud Pak Bean instead of Mr Bean Rowan ..we will settle the matter tommorow just pray the rains will save you…#ZIMVSPAK
— Ngugi Chasura (@mhanduwe0718061) October 25, 2022
No problem, we have also given you the original Sikander Raza. Matter resolved 😂
— Azhar Abbas (@azharabbas02) October 26, 2022