టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయా? సెమీస్ చేరడమేనా కష్టమేనా? అంటే అవుననే సమాధానం అనిపిస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై నెగ్గిన భారత జట్టు అలవోకగా సెమీస్ చేరుతుందని అందరూ అంచనా వేశారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఓటమి పాలవడంపై సమీకరణాలు పూర్తిగా మారాయి. ప్రస్తుతానికి ఈ ఓటమి జట్టును బాధించకపోయినా సెమీస్ చేరాలంటే మాత్రం ఆడబోయే రెండు మ్యాచులలో మాత్రం తప్పక గెలవాల్సిందే. కాకుంటే ఈ మ్యాచులకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అదే టీమిండియాను కలవర పెడుతోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచులు రద్దయితే భారత జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుందా? లేదా? అన్నది చూస్తే..
గ్రూప్-2 పాయింట్స్ టేబుల్ ను పరిశీలిస్తే.. నెదర్లాండ్స్ జట్టు దాదాపు సెమీస్ బెర్త్ కు దూరమైనట్లే. ఇక దాయాది పాకిస్తాన్ కూడా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ చేరదు. దీంతో నాలుగు జట్ల మధ్య అసలు పోటీ ఉంది. ప్రస్తుతానికి 5 పాయింట్లతో సౌతాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా, 4 పాయింట్లతో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో బంగ్లాదేశ్(4 పాయింట్లు), 4వ స్థానంలో జింబాబ్వే(3 పాయింట్లు) ఉన్నాయి. ఇక్కడ టీమిండియా సెమీస్ అవకాశాలను పరిశీలిస్తే.. సూపర్ -12 స్టేజులో భారత్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో అక్టోబర్ 30న, జింబాబ్వేతో నవంబర్ 6న మ్యాచులు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే 8 పాయింట్లతో టీమిండియా సెమీస్ చేరడం పక్కా. ఒకవేళ ఓడినా, వర్షం కారణంగా రద్దయినా ఇతర జట్ల విజయాపజయాలపై ఆధారపడాల్సిందే.
బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచులో భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో సెమీస్ బెర్త్ కు మరింత దగ్గరకావచ్చు. ఒకవేళ ఓడితే బంగ్లాకు 6 పాయింట్లు లభిస్తాయి. ఫలితంగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఆపై పాకిస్తాన్ తో జరిగే మ్యాచులో విజయం సాధించినా/రద్దయినా సెమీస్ చేరడం పక్కా. ఒకవేళ ఈ మ్యాచులో ఓడితే మాత్రం దాదాపు ఇంటిదారి పట్టినట్టే. ఇక్కడ మరో జట్టు జింబాబ్వేను తక్కువుగా అంచనా వేయలేం. ఇప్పటికే దాయాది పాకిస్తాన్ కు షాకిచ్చి సేమిన్ రేసులో ఉంది.
ఒకవేళ భారత జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచి జింబాబ్వే చేతిలో ఓడితే, జింబాబ్వే, దక్షిణాఫ్రికా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. అయితే, జింబాబ్వే ముందుగా నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. డచ్ జట్టును ఓడించడం జింబాబ్వేకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఈ పరిస్థితిలో భారత్‌కు 6 పాయింట్లు, జింబాబ్వే 7 పాయింట్లతో సెమీఫైనల్స్ కు చేరతాయి. రాబోయే రోజుల్లో రద్దయితే భారత్ ఖాతాలో 6 పాయింట్లు ఉంటాయి. అటువంటి పరిస్థితిల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా జింబాబ్వేలో ఒకటి దక్షిణాఫ్రికాతో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవచ్చు. అంటే.. టీమిండియా సెమీస్ అవకాశాలు వరుణుడి చేతిలో ఉన్నాయన్నమాట.
South Africa swap position with India in the updated points table in Group 2.#INDvSA #T20WorldCup #T20WC2022 #CricketTwitter pic.twitter.com/8AX0cPCgod
— CricTracker (@Cricketracker) October 30, 2022