టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వే జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు వీర విహారం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సారధి రోహిత్ శర్మ (15) మరోసారి నిరాశపరిచగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక మాజీ సారధి విరాట్ కోహ్లీ (26) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 15వ వరకు చప్పగా సాగిన మ్యాచ్ సూర్యకుమార్ మెరుపులతో ఒక్కసారిగా ఊపందుకుంది. జింబాబ్వే బౌలర్లపై ఎదుదాడికి దిగిన సూర్య 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఈ ఏడాది టీ20ల్లో 1000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
SKY powered India to a big total at MCG 🔥👏#SuryakumarYadav #India #INDvsZIM #T20WorldCup #Cricket pic.twitter.com/4iRrbMWXKj
— Wisden India (@WisdenIndia) November 6, 2022
15 ఓవర్లు ముగిసే సమయానికి 107 పరుగులే చేసిన టీమిండియా, చివరి ఐదు ఓవర్లలో భారత్ 79 పరుగులు చేసింది. ముజరబానీ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో సూర్య, పాండ్యా కలిసి18 పరుగులు రాబట్టగా, ఆ తర్వాతి ఓవర్‌లో 12 పరుగులు రాబట్టాడు. ఆ తరువాత వరుసగా 15 (18వ ఓవర్) , 13 (19వ ఓవర్), 21 (20వ ఓవర్) పరుగులు రాబట్టాడు. దీంతో భారత జట్టు జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. కాగా, అంతకుముందు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్‌కు చేరింది. మరో మ్యాచులో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచులో భారత్ గెలిస్తే.. సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది.
MOST RUNS IN A YEAR 2022 🤯 SURYA KUMAR YADAV 🔥#INDvsZIM #T20worldcup22 pic.twitter.com/tls9gJHn3w
— Amit! (@AMITZZZ_) November 6, 2022