టీ20 ప్రపంచ కప్ వేటలో పాకిస్తాన్ పోరు ముగిసినట్లే కనిస్తోంది. జింబాబ్వేపై ఓడటమే అందుకు కారణం. జింబాబ్వే నిర్దేశించిన 130 టార్గెట్ ను ఛేదించలేకపోయారు.. పాక్ బ్యాటర్లు. నిర్ణీత ఓవర్లలో 129 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడారు. దీంతో పాక్ సెమీస్ చేరే అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. సెమీస్ చేరాలంటే.. తను ఆడే మిగతా మూడు మ్యాచుల్లో గెలవడంతోపాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడివుంది. అయితే.. ఇక్కడ పాక్ ఓటమిని శాసించింది మాత్రం.. సికందర్ రజానే. 3 వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.. రజా. అంతేకాదు.. తన వేరియేషన్స్ తో పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. 6 బంతుల్లో 4 వేరియేషన్స్ చూపించి ఔరా అనిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 14 ఓవర్లు ముగిసేసరికి 87/3తో పటిష్టంగానే ఉన్నా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచులో ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ గా నిలిచిన సికందర్ రజానే ఈ మ్యాచుకు హీరో. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలింగ్ లో 3 కీలక వికెట్లు పడగొట్టి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆడుతూ.. పాడుతూ.. లక్ష్యాన్ని ఛేదిస్తున్న పాక్ బ్యాటర్లకు తన వినూత్న బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. రజా బౌలింగ్ శైలి.. అచ్చం మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ను పోలి ఉంటుంది.
Sikandar Raza was in tears after the win – he knows what Zimbabwe have done over the years.
One of the best days in Zimbabwe cricket history. pic.twitter.com/JU0Cab9Tq3
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2022
నరైన్ బాల్ వెనుకవైపు దాచుకొని వచ్చి డిఫరెంట్ వేరియేషన్స్ తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. రజా సైతం అచ్చం అలానే 6 బంతుల్లో 4 వేరియేషన్స్ చూపించి పాక్ బ్యాటర్ల భరతం పట్టాడు. క్రాస్ సీం, బ్యాక్ అఫ్ హ్యాండ్, క్యారం బాల్, ఆఫ్ స్పిన్.. ఇలా ఒక్కో బంతిని ఒక్కోలా వేస్తూ కీలక వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి 3 బంతుల్లో మ్యాచ్ ముగుస్తుందనే వరకు విజయం పాకిస్తాన్ వైపే ఉంది. విజయయానికి ఆఖరి 3 బంతులకు 3 పరుగులు చేయాలి. ఇలాంటి సమయంలో భారీ షాట్ కు ప్రయత్నించి మ్యాచ్ పోగొట్టుకున్నారు. ఇక తదుపరి పాక్, నెదర్లాండ్స్ తో తలపడనుండగా, జింబాబ్వే, బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది.
Sikandar Raza is just amazing 🔥🔥
He truly deserved a IPL contract, Amazing bowler ❤️ pic.twitter.com/XmuglybTrr— 💙✧♡ABHI♡✧💙 (@hitman_Rohit_07) October 27, 2022
Sikandar Raza with a no gather action much like Sunil Narine, hiding the bowling arm behind his body. pic.twitter.com/KOUHlOfmuf
— Cricket With Ash (@CricketWithAsh) January 16, 2022
Give Sikandar Raza an IPL contract please.
PS: That’s not Sunil Narine bowling in the Zimbabwe jersey pic.twitter.com/Fh0z1WzpcM
— Aritra Mukherjee (@aritram029) October 27, 2022