టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకి వరస ఓటములు. టీమిండియా బాగా ఆడారు. కానీ పాత కోహ్లీ బయటకొచ్చేసరికి పాక్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఇక జింబాబ్వేతో మ్యాచ్ అయితే హైలెట్ అసలు. ఎందుకంటే ఇంతకుముందు జింబాబ్వేపై పాక్ గెలిచింది. దీంతో దాయాది జట్టు మ్యాచ్ గెలిచేస్తుందని అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా చివరి బంతి వరకు సాగింది. కానీ పాక్ బ్యాటర్ల వైఫల్యం వల్ల ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఏకంగా సెమీస్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా పాక్ అభిమానులు.. టీమిండియా గెలవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సోషల్ మీడియాలో అదికాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే టీ20 ప్రపంచకప్ లో భారత్ ఘోరమైన ప్రదర్శన చేసింది. తొలి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మిగతా మూడు మ్యాచుల్లో గెలిచినా సరే ఫలితం లేకుండా పోయింది. అప్పుడు పాక్ ఫ్యాన్స్ ఎగిరెగిరి పడ్డారు. బాయ్ బాయ్ ఇండియా అని స్టేడియంలో పేపర్లు చూపించి మరీ ట్రోల్ చేశారు. అలా ఏడాది గడిచిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. అయితే ఏడాది క్రితం దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతోంది. దీంతో పలువురు మన నెటిజన్స్… పోలిక చూపిస్తూ పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని ట్రోల్ చేస్తున్నారు.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు వరసగా రెండు మ్యాచులు ఎలా అయితే ఓడిపోయిందో.. ప్రస్తుతం పాక్ జట్టు పరిస్థితి అలానే తయారైంది. గతేడాది పాక్ తో మ్యాచ్ భారత టాపార్డర్ కుప్పకూల్చిన షాహీన్ అఫ్రిది.. ఈసారి మ్యాచులో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సరికదా మనోడి బౌలింగ్ ని ఉతికారేశారు. ఇక జింబాబ్వే మ్యాచ్ చివరి బంతికి విన్నింగ్ షాట్ ఆడలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గతేడాది పాక్ తో మ్యాచ్ లో భారత్ 151 పరుగులు చేస్తే, పాక్ ఓపెనర్లు మొత్తం లక్ష్యాన్ని వికెట్ పడకుండా ఛేదించారు. ఇప్పుడు అదే పాక్ జట్టు.. జింబాబ్వేపై 130 పరుగులు చేయలేక నానాపాట్లు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) October 28, 2022
Always Remember #T20WorldCup #INDvPAK #ShaheenAfridi pic.twitter.com/9CvPvXHbAP
— RVCJ Media (@RVCJ_FB) October 23, 2022
Shaheen Afridi #T20WorldCup #PAKvZIM pic.twitter.com/VuazZtPCEu
— RVCJ Media (@RVCJ_FB) October 27, 2022