ఆఫ్ఘనిస్తాన్.. పేరుకు పసికూన జట్టైనా అంచనాలకు మించి రాణించగల జట్టు. రషీద్ ఖాన్, ముజీబర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, రహ్మనుల్లా గుర్భాజ్, నజీబుల్ జార్దాన్.. ఇలా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. అయినప్పటికీ ఆ జట్టు టీ20 ప్రపంచ కప్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనపరచలేదు. ఆడిన 5 మ్యాచుల్లో మూడింట ఓటమి పాలవగా, మరో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ ఓటములకు ఆటగాళ్లు రాణించకపోవడం ఒక కారణమైతే.. వారిలో ఐకమత్యం లోపించడం మరో కారణం. దీంతో ఆ జట్టు సారధి ‘మహ్మద్ నబీ’ జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు నబీ ట్విటర్ వేదికగా తమ అభిమానులకు ఒక సందేశాన్ని పంపాడు.
“టీ20 ప్రపంచ కప్ లో మా ప్రయాణం నేటితో ముగిసింది. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ స్థాయిలో మా ప్రదర్శన లేదు. ఈ ఫలితాలు మాకు కానీ, మా మద్దతు దారులకు కానీ నచ్చలేదు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నేను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. గతేడాది నుంచి మా జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి తగ్గట్టుగా లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే రకంగా లేం. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. ఇది జట్టు బ్యాలెన్స్ పై ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించా. ఈ విషయాన్ని ఇప్పటికే మేనేజ్మెంట్ కు తెలియజేశాను”.
Here is how the Group 1 Points Table stands after Australia survive a scare from Afghanistan.#T20WorldCup #AsliKhelToAbHoga #Super12 #AUSvsAFG #TenSportsHD pic.twitter.com/kHhKp2vX9O
— TenSports Pakistan (@TenPakistan) November 4, 2022
“అయితే కెప్టెన్ గా తప్పుకున్నప్పటికి జట్టు అవసరమనుకుంటే ఒక ఆటగాడిగా మాత్రం కొనసాగుతాను. ఇన్నాళ్లు కెప్టెన్ గా నాకు మద్దతిచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వర్షం కారణంగా రెండు మ్యాచులు రద్దయినప్పటికీ, మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లాంగ్ లైవ్ అఫ్గానిస్తాన్ ” అంటూ నబీ తన సందేశాన్ని ముగించాడు. నబీ సారథ్యంతో అఫ్గాన్ ఈ టోర్నీలో రాణించిపోయినా ఇంతకు ముందు మంచి ప్రదర్శన చేసిందనే చెప్పాలి. అతని సారథ్యంలోనే అఫ్ఘాన్ జట్టు తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లోకి వచ్చింది. 2017లో అఫ్ఘాన్ టెస్టు హోదా కూడా పొందింది. మొత్తంగా నబీ అఫ్గానిస్తాన్ సారధిగా 28 వన్డేలకు, 35 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
— Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022