టీ20 ప్రపంచకప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. ముఖ్యంగా సూపర్ -12 పోరు రసవత్తరంగా మారింది. గ్రూప్-1లో సెమీస్ బెర్త్ కోసం.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ ఉంటే, గ్రూప్-2లో సినిమాను తలదన్నే ట్విస్టులు వచ్చేలా ఉన్నాయి. అయితే అదంతా వరుణ దేవుడి చేతుల్లోనే ఉంది. ఇదిలావుంచితే, పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై విజయంతో సెమీస్ రేసులో ఉన్న భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలవడంతో సమీకరణాలు పూర్తిగా మారాయి. తదుపరి ఆడబోయే రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ తరుణంలో భారత్ ను ఓడిస్తామంటే బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ హెచ్చరికలు పంపగా, భారత అభిమానులు అదే రీతిలో అతనికి కౌంటర్ ఇస్తున్నారు.
బుధవారం అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ చాలా చిన్న జట్టే అయినా.. ఏ మాత్రం లైట్ తీసుకోలేం. 2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా ఓడించినంత పనిచేసింది. అదే మరోసారి రిపీట్ అవుతుందంటూ బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ ఇప్పటికే హెచ్చరికలు పంపాడు. అందుకు ప్రతిగా భారత అభిమానులు.. అడిలైడ్ వేదికగా కోహ్లీ రికార్డులను అతనికి బదులు పంపుతున్నారు. అడిలైడ్‌లో విరాట్ గత రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. 84.30 సగటుతో 843 పరుగులు చేశాడు. అడిలైడ్ వేదికపై ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 9 మ్యాచులు ఆడిన కోహ్లీ 843 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 141. ఇక అడిలైడ్‌లో ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన విరాట్.. ఆ మ్యాచులో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Virat Kohli at Adelaide Oval
– 1st Test ton Vs AUS (2012)
-100s in each innings on his Test captaincy debut (141 & 115) Vs AUS (2014)
– 107 v Pakistan in WC in (2015)
– 90* v Australia in a T20I (2016)
– 104 in ODI v Australia (2019)
– 74 in Pink Ball Test Vs AUS, (2020)#ICC— Malik Asif Dhakoo (@malikasifdhakoo) November 1, 2022
కాకుంటే ఇటీవల భారత్, ఇదే వేదికపై 36 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి మరువకూడదు. అసలే వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో ఫలితం తేడా కొడితే భారత్ తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి రావాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా, భారత జట్టు 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ సైతం 4 పాయింట్లతో ఉన్నప్పటికీ రన్‌రేట్ కారణంగా మూడోస్థానంలో కొనసాగుతోంది. భారత్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్‌పై గెలవడంతో పాటు జింబాబ్వేను ఓడించాలి. ఈ రెండింటిలో ఒక్కటి ఓడినా.. వర్షంతో రద్దయినా ఇతర జట్ల విజయవకాశాలపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో బంగ్లా మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Points table of Group 2 in Super 12. pic.twitter.com/DONJdxrI4y
— Johns. (@CricCrazyJohns) October 30, 2022