గ్రౌండ్ ఏదైనా.. పిచ్ ఎలా ఉన్నా.. ఎన్ని వికెట్లు పడినా.. బౌలర్ ఎవరైనా.. అతని సంబంధం లేదు. బంతి పడిందా బాదడమే అతని పని.. అతనే మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో యువ సంచలనం. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాలో అతనే తురుపుమొక్క. జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించగల సమర్థుడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. గురువారం నెథర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరొగొట్టాడు.
టీమిండియా రన్‌మెషీన్, కింగ్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి.. ఇన్నింగ్స్ చివరి బంతికి భారీ సిక్స్‌తో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు.. నెథర్లాండ్స్ ముందు 180 పరుగుల టార్గెట్‌ను ఉంచగలిగాడు. అప్పటికే పిచ్ స్లోగా ఉండటంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆరంభంలో తీవ్ర ఇబ్బందిపడ్డారు. పిచ్‌కు తోడు నెథర్లాండ్స్ బౌలర్లు మరింత స్లోగా బౌలింగ్ వేయడంతో.. బంతి బ్యాడ్‌మీదికి రావడమే కష్టమైంది. అయినా కూడా కోహ్లీ, రోహిత్ హాఫ్‌సెంచరీలో పూర్తి చేసుకున్నారు. కానీ.. అవి రెండు కూడా టీ20 స్టైల్లో లేవు. 35 బంతుల్లో రోహిత్, 37 బంతుల్లో విరాట్ కోహ్లీ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. కానీ.. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత.. సీన్ మొత్తం మార్చేశాడు.
ఇంతసేపు రోహిత్, కోహ్లీ ఇబ్బంది పడిన పిచ్ ఇదేనా అనే సందేహం వచ్చేలా చెలరేగిపోయాడు. 25 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు పూర్తి చేసుకుని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతి ముగిసే సరికి సూర్యకుమార్ యాదవ్ స్కోర్ 45 పరుగులు మాత్రమే.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా సిక్స్ కొట్టాలి. నెథర్లాండ్స్ బౌలర్ వాన్ బీక్ చివరి బంతిని లెగ్‌స్టంప్ వైపు హాఫ్ వాలీగా వేశాడు. ఆ బంతిని అద్భుతంగా ఫ్లిక్ షాట్ ఆడిన సూర్య.. బ్యాక్‌వర్డ్ స్క్వైర్ లెగ్ మీదుగా సిక్స్ బాదాడు. అంతే సూర్య ఫిఫ్టీతో పాటు నెథర్లాండ్స్ ముందు 180 టార్గెట్ వచ్చిపడింది. ఈ సూపర్‌తో ఫిఫ్టీ తర్వాత కోహ్లీతో ఓ రేంజ్‌లో సూర్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మధురమైన మూమెంట్స్‌ను మరోసారి తన ఫోన్‌లో చూసుకుంటూ సూర్య మురిసిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#INDvSA
This is beautiful – Suryakumar Yadav watching his celebration with Virat Kohli and enjoying it. pic.twitter.com/MQ2SnvFca4— 👌⭐👑 (@superking1815) October 28, 2022