సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు ఇండియన్ క్రికెట్లో ఇప్పుడొక సంచలనం. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్‌తో టీమిండియా పోరాటం ముగిసినప్పటికీ.. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరు ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌తో కలుపుకుని మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అవి కూడా వాయువేగంతో వచ్చిన ఫిఫ్టీలు. పైగా.. అతను ఆడిన షాట్లు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. కింగ్ కోహ్లీ సైతం సూర్య షాట్లకు ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన చివరి సూపర్ 12 మ్యాచ్‌లో ఆఫ్‌సైడ్ వైడ్ వెళ్లున్న బంతిని ఫైన్‌లెగ్ మీదుగా కొట్టిన సిక్స్ అయితే నభూతో నభవిష్యతిః.
సంచలనమైన ఆటతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు సూర్య. అతని మాస్ బ్యాటింగ్ తక్కువ కాలంలోనే భారీగా అభిమానులను తెచ్చిపెట్టింది. దీంతో సూర్యను ఇష్టపడే వారి సంఖ్య లక్షల నుంచి కోట్లకు చేరింది. ఈ వరల్డ్ కప్ ప్రారంభం అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 300 రెట్లు పెరిగింది. ఈ నంబర్స్ సూర్య ఫాలోయింగ్, క్రేజ్, రేంజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ విషయం సూర్యకు కూడా అర్థమై ఉంటుంది. అందుకే తన క్రేజ్ ఎలా అయితే పెరిగిందో తన రేట్ కూడా అదే రేంజ్లో పెంచేశాడు ఈ మిస్టర్ 360. తన బ్రాండ్ వాల్యూకు తగ్గట్లు.. బ్రాండ్ల ప్రమోషన్లకు తనను వాడుకోవాలంటే.. సూర్యకు భారీగా చెల్లించుకోవాల్సిందే.
ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటే.. రోజుకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు తీసుకునేవాడు. ఇప్పుడు తన రేంజ్ మారిపోయింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఒక రోజు షూటింగ్లో పాల్గొంటే సూర్యకు ఏకంగా రూ.65 లక్షలు ముట్టచెప్పాల్సిందే. ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు ఇప్పటికే ఒక 15 కంపెనీలు సైతం సూర్య కోసం క్యూలో ఉన్నట్లు సమాచారం. అయితే.. ఒక ఆటగాడి సోషల్ మీడియా ఫాలోవర్లను బట్టి.. అతని క్రేజ్‌ను బట్టి వివిధ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ల కోసం వారికి ఇంత భారీ మొత్తం చెల్లిస్తాయి. ఇక టీమిండియా క్రికెటర్లలో ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ అత్యధిక పారితోషకం తీసుకునేది మాత్రం కింగ్ కోహ్లీనే. ఇండియాలో మరెవరికీ లేనంతమంది ఫాలోవర్లు కోహ్లీకి ఉన్న విషయం తెలిసిందే. చూస్తుంటే.. సూర్య కూడా త్వరలోనే కోహ్లీ రేంజ్‌కు చేరుకునేలా ఉన్నాడు.
Suryakumar Yadav has increased his fees to 65 lakh/day from 15 lakh/day in 2021 for brand endorsement.
.
.
.
.#dtsolutionz #digitechsolutionz #suryakumaryadav #suryakumar #cricket #icc #WorldCup2022 #t20worldcup #T20Iworldcup2022 pic.twitter.com/EppIRJ6z89— Digitech Solutionz (@DTSolutionz) November 10, 2022