టీ20 మినీ సంగ్రామంలో భారత పోరాటం ముగిసింది. చివరి మ్యాచ్ లో ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి నమస్కారం పెట్టి.. ఇంటి దారి పట్టింది. దాంతో అభిమానులతో పాటుగా ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. తాజాగా భారత నయా డైనమెట్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ ఓటమిపై ట్వీటర్ వేదిగా స్పందించాడు. ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నాను అంటూ రాసుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్.. విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఆడి, గెలిచిన ప్రతీ మ్యాచ్ లో వినిపించిన పేర్లు. ఈ టోర్నీలో వీరిద్దరు పోటీ పడి మరి పరుగులు సాధించారు. అయినా గానీ టీమిండియాకు కప్ ను అందించలేకపోయారు. క్రికెట్ ఆటలో ఏ ఒక్కరో.. ఇద్దరో ఆడితే మ్యాచ్ గెలవదు. జట్టులోని ఆటగాళ్లందరు సమష్టిగా రాణిస్తేనే టీమ్ విజయం సాధిస్తుంది. ఇక టీమిండియా ఓటమి చెందడంతో ఎక్కువగా బాధపడింది ఎవరంటే కచ్చితంగా విరాట్, సూర్య అనే చెప్పాలి. ఎందుకంటే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది వీరిద్దరే కాబట్టి. కోహ్లీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మిస్టర్ 360 బ్యాటర్ కూడా ట్వీట్ చేశాడు.
Hurtful loss.
Forever grateful to our fans who create electrifying atmosphere, no matter where we play. Thankful for the undying support for each other, proud of the hardwork put in by this team &support staff.
Proud to play for my country🇮🇳
We will reflect &come back stronger! pic.twitter.com/EeuLz45kgl— Surya Kumar Yadav (@surya_14kumar) November 11, 2022
“ఈ ఓటమి మమ్మల్ని ఎంతో బాధించింది. సెమీస్ లో ఒత్తిడిని జయించడంలో మేం విఫలం అయ్యాం. ఇక మాకు ప్రతీ మ్యాచ్ లో కొండంత అండగా నిలిచిన అభిమానులకు ఎంతో రుణపడి ఉంటాము. మేం ఎక్కడ ఆడితే అక్కడ మాలో ఫుల్ జోష్ నింపారు మీరు. దాంతో మాకు ఆస్ట్రేలియాలో ఆడుతున్నట్లే లేదు. సొంత గడ్డపై ఆడిన ఫీలింగ్ వచ్చింది. ఇంత మద్దతు ఇచ్చినందుకు థ్యాక్స్. జట్టుతో పాటు సపోర్ట్ స్టాఫ్ కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా దేశం తరపున ఆడటం గర్వంగా ఉంది.. మేం మళ్లీ తిరిగి పుంజుకుని, బలంగా తరిగివస్తాం” అని సూర్య కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ ప్రపంచ కప్ లో 6 మ్యాచ్ ల్లో 239 పరుగులు చేశాడు సూర్యా భాయ్. 189 స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం. అదీకాక ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు సూర్యకుమార్.
A half-century in the semi-final sees Virat Kohli sit comfortably at the top of the list 📈
More #T20WorldCup stats 👉 https://t.co/ud7AFNKKOk pic.twitter.com/OshA1QIA4Q
— T20 World Cup (@T20WorldCup) November 11, 2022