టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి మరీ ఆడుతున్నారు. మొన్నటి వరకు రాహుల్ ఆడట్లేదని అన్నారు. కానీ మనోడు కూడా బ్యాక్ టూ బ్యాక్ రెండు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. కప్ గెలవడానికి అన్ని కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కటి తప్ప. అదే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. చెప్పాలంటే ఫార్మాట్ ఏదైనా సరే హిట్ మ్యాన్, ఒక్కసారి కుదురుకుంటే దంచికొడతాడు. అలాంటి రోహిత్.. టీ20 వరల్డ్ కప్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఇప్పుడు అదే విషయాన్ని ఎత్తిచూపిన మాజీ క్రికెటర్ గావస్కర్.. కెప్టెన్ రోహిత్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రూప్ బీలో టేబుల్ టాపర్ గా నిలిచిన టీమిండియా దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ తో గురువారం మ్యాచ్ కూడా ఆడనుంది. అప్పుడెప్పుడో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం తప్పించి.. ఆ తర్వాత కప్ గెలవలేకపోయింది. ప్రతి టోర్నీలోనే నాకౌట్ దశలో ఓడి ఇంటిముఖం పట్టింది. అయితే ఈసారి మాత్రం మనకు టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అన్ని విభాగాలు పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. జస్ట్ సెమీస్, ఫైనల్ గెలవడమే లేటు. ఇలాంటి టైములో రోహిత్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కీలకమని గావస్కర్ అన్నాడు.
‘తర్వాతి రెండు మ్యాచ్ ల కోసం రోహిత్.. తన పరుగుల్ని సేవ్ చేశాడనుకుందాం. సెమీస్ లో ఆడేవి పెద్ద మ్యాచులు. గ్రూప్ స్టేజీలో ఓ మ్యాచ్ ఓడిపోతే ఇంకో మ్యాచ్ లో ఛాన్సు ఉంటుంది. కాబట్టి ప్రయోగాలు చేయొచ్చు. విజేతగా కూడా నిలవొచ్చు. కానీ నాకౌట్ మ్యాచుల్లో అలా చేయలేం. ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆడాలి. ఇకపోతే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ లోకి రావాలి. అంతకు మించి వేరే ఛాన్స్ లేదు’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక అతి దూకుడు స్వభావం కూడా రోహిత్ కు మంచిది కాదని అన్నాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకుని, ధనాధన్ బ్యాటింగ్ చేయాలని సూచించాడు.
సూపర్-12 దశలోని మ్యాచుల్లో నెదర్లాండ్స్ పై హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. పాక్ పై 4, బంగ్లాపై 2, దక్షిణాఫ్రికాపై 15, జింబాబ్వేపై 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇందువల్లే గావస్కర్ తో పాటు పలువురు మాజీలు రోహిత్ గురించి మాట్లాడవలసి వస్తోంది. ఇదిలా ఉండగా 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో రోహిత్ సభ్యుడే. ఇతడితో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే.. అప్పుడు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నారు. దీంతో అభిమానులు.. ఈసారి ఎలాగైనా కప్ గెలుస్తామని అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు. మరి సెమీస్ లో మన జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి?
Sunil Gavaskar backs skipper Rohit Sharma to score big runs in the business end of the T20 World Cup 2022.#CricTracker #SunilGavaskar #RohitSharma #T20WorldCup pic.twitter.com/43CWJ9HKgd
— CricTracker (@Cricketracker) November 7, 2022
Can India take the T20 World Cup trophy home? 🤔
#India #RohitSharma #ViratKohli #T20WorldCup pic.twitter.com/p1ti2dTPig
— CricTracker (@Cricketracker) November 8, 2022
Will Kane Williamson, Jos Buttler, Rohit Sharma and Babar Azam score big for their teams in semi-finals?
Stats via Mohandas Menon#KaneWilliamson #JosButtler #RohitSharma #BabarAzam #T20WorldCup pic.twitter.com/JVs2FU8is0
— CricTracker (@Cricketracker) November 8, 2022