ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీకే మచ్చ తెచ్చే ఘటన ఇది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లిన శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అతన్ని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు లేకుండానే శ్రీలంక జట్టు స్వదేశానికి బయలుదేరింది. 2018 లోను ధనుష్క ఇదే తరహా కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అప్పట్లో ఆ ఆరోపణలపై 6 మ్యాచుల నిషేధం కూడా ఎదొర్కొన్నాడు.
దనుష్క గుణతిలక శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడు. నమీబియాతో జరిగిన తొలి మ్యాచులో ఆడిన అతను డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవ్వగా, అతని స్థానంలో అషన్ బండారను జట్టులోకి తీసుకున్నారు. అయినప్పటికీ అతడు స్వదేశానికి వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నిలోని ఓ హోటల్లో ధనుష్క ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో సిడ్నీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Sri Lanka batter Danushka Gunathilaka has been charged by police after an alleged sexual assault in Sydney
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2022
ఇక శ్రీలంక జట్టు ఆదివారం ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో అతడు లేకుండానే శ్రీలంక జట్టు స్వదేశానికి పయనమయింది. ఇదిలా ఉంటే ధనుష్క గుణతిలక అరెస్ట్ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్ పోలీసులు స్పందించారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో క్రికెటర్ అరెస్ట్ పై స్పందించింది. రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2న క్రికెటర్ అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్కను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
🚨 NEWS ALERT 🚨
According to reports, Danushka Gunathilaka, who remained with the squad despite being ruled out of the #T20WorldCup with injury, has been reportedly arrested in Sydney for rape.
The Sri Lankan team have left for home leaving him behind. #CricketTwitter pic.twitter.com/HmclYMiLuX
— Sportskeeda (@Sportskeeda) November 6, 2022