ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో వింతలు, విడ్డూరాలే జరుగుతున్నాయి. ఆటతో పాటు ఈ విచిత్ర సంఘటనలూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మ్యాచులో సిక్సులు, ఫోర్లు, ఊహించని క్యాచ్ లు పట్టడం, వికెట్ కీపర్ విన్యాసాలు సాధారణం. అయితే ఫీల్డర్లు చేస్తున్న కొన్ని తప్పిదాలు ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏదో గల్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరిగితే పర్లేదు కానీ, ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ లో ఆటగాళ్లు ఇలా చేస్తుండడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సిడ్నీ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ మ్యాచులో అలాంటి విచిత్ర సంఘటన జరిగింది. ఏదో చేయబోయి బంగ్లా క్రికెటర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఫలితంగా 5 పరుగులు పెనాల్టీ విధించారు అంపైర్లు.
టీ 20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 101 పరుగులకే కుప్పకూలింది. అయితే.. ఈ మ్యాచులో బంగ్లా వికెట్ కీపర్ నూరల్ హసన్ చేసిన చిన్న తప్పిదం వల్ల దక్షిణాఫ్రికాకు 5 పరుగులు బోనస్ గా వచ్చాయి.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్ అఖరి బంతి డెలివర్ కాకముందే బంగ్లా వికెట్ కీపర్ నూరుల్ హసన్ పక్కకు(ఎడమ వైపుకు) కదిలాడు. ఐసీసీ నింబంధనల ప్రకారం.. బౌలర్ రన్-అప్ సమయంలో వికెట్ కీపర్ కదలడానికి అనుమతి లేదు. అంటే.. బాల్ పడేవరకు ఎక్కడ మొదట నిల్చున్నాడో.. అక్కడే నిలబడాలి. కానీ, నురుల్ హసన్ ఇక్కడ కదిలాడు. దీంతో అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఇలాంటి సంఘటనలు గల్లీ క్రికెట్ లో ఎక్కువుగా జరిగితున్నాయి. బ్యాటర్ ను స్టంప్ ఔట్ చేయాలనే ఉద్దేశ్యంతో కీపర్ ముందుకు కదులుతూ వస్తుంటాడు.
Bangladesh suffers 5 Run penalty…#Bangladesh #runpenatly#wicketkeeper #nurulhasan pic.twitter.com/to1AecJlju
— Daddyscore (@daddyscore) October 27, 2022
ఐసీసీ నిబంధనల ప్రకారం.. మ్యాచులో 5 పరుగులు పెనాల్టీ విధించే సంఘటనలు చాలా ఉన్నాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కీపర్ మినహా ఏ ఒక్క ఫీల్డర్ గ్లవ్స్ ధరించకూడదు. అలా చేస్తే పెనాల్టీ తప్పదు. అలాగే.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కీపర్లు అప్పుడప్పుడు హెల్మెట్ తీసి వెనుకవైపు ఉంచుతుంటారు. ఆ సమయంలో పోరపాటున బాల్ దానికి తాకితే 5 పరుగులు పెనాల్టీ ఉంటుంది. అంతేకాదు.. కీపర్, కీపింగ్ చేస్తున్న సమయంలో గ్లోవ్స్/ హెల్మెట్ జారీ కిందపడినపుడు, ఆ సమయంలో బాల్ వచ్చి వాటిని తాకినా పెనాల్టీ విధిస్తారు. అలాగే.. బౌలర్ బాల్ వేయడానికి రన్ అప్ తీసుకున్నప్ప్పుడు కీపర్ కదలడానికి వేయలేదు. అలా చేసినాపెనాల్టీ తప్పదు.
— Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 27, 2022