ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా పోరాటం ముగిసింది. సూపర్ 12లో అద్భుతంగా ఆడిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల మంచి టార్గెట్ సెట్ చేసిన టీమిండియా.. బౌలింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ టోర్నీలో పవర్‌ప్లేలో అద్భుతంగా పరుగులు రాబడుతున్న ఇంగ్లండ్ ఓపెనర్లు.. సెమీస్‌లోనూ అదే ఊపును కొనసాగించారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. జట్టులో చాలా లోపాలు ఉన్నా.. టీమిండియా సెమీస్ వరకు రావడం గొప్ప విషయమే. జట్టు బౌలింగ్ విభాగం స్ట్రాంగ్‌గా లేకపోయినా.. ఓపెనర్లు ఫామ్‌లో లేకున్నా.. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భారత్‌ను సెమీస్ వరకూ చేర్చారు.
సెమీస్‌లో టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 27 పరుగులతో పర్వాలేదనిపించినా.. అది తన స్థాయి ఇన్నింగ్స్ అయితే కాదు. ఇక ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మరోసారి తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చి.. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కోహ్లీతో పాటు ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మాత్రం విఫలం అయ్యాడు. కేవలం 14 పరుగులు చేసి.. భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా-విరాట్ కోహ్లీ జోడి మరోసారి మంచి భాగస్వామ్యానిఇన అందించింది. 18వ ఓవర్‌లో కోహ్లీ అవుటైనా.. హార్దిక్ పాండ్యా చెలరేగి చివర్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 63 పరుగుల చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. కానీ.. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెన్లు బట్లర్-అలెక్స్ 16 ఓవర్లలోనే ఊదిపడేశారు.
ఇక సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి.. పాకిస్థాన్‌తో టీమిండియా ఫైనల్ ఆడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకున్నాడు. కానీ.. దురదృష్టవశాత్తు సెమీస్‌లో భారత్ ఓడిపోయింది. కాగా.. ఈ ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. తరచూ ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలిచే అక్తర్.. భారత్ ఓటమి తర్వాత.. ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ‘టీమిండియా చాలా చెత్తగా ఆడింది. చెండాలంగా ఓడింది. బౌలింగ్‌లో ఏ మాత్రం పస లేదు. చాహల్‌ను ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు. అసలు టీమ్ సెలెక్షన్ సరిగా లేదు. ఆస్ట్రేలియా అంటేనే పేస్ బౌలింగ్‌కు పేరు. అలాంటిది జట్టులో ఒక్క నిఖార్సయిన పేసర్ లేడు. పిచ్ అనుకూలిస్తే తప్ప ఈ బౌలర్లు వికెట్లు తీయలేరు. వికెట్లు తీద్దామనే ఉద్దేశం వారిలో కనిపించలేదు. వికెట్లు పడకుండా ఇంగ్లండ్ బ్యాటర్లు ఫ్రీగా ఆడుతుంటే.. కనీసం అరౌండ్‌ది వికెట్ వచ్చి.. బౌన్సర్లు వేయడమో.. వారిని ఏదో ఒకటి అని డిస్టబ్ చేయడమో చేయలేదని. ఇంగ్లండ్ 5 ఓవర్ల బ్యాటింగ్ తర్వాత భారత్ చేతులు ఎత్తేసినట్లు అర్థమైపోయింది. ఇక ఫైనల్లో మీతో ఆడదామనుకుంటే.. మీరేమో ఇలా చేశారు.’ అంటూ అక్తర్ పేర్కొన్నాడు.
Embarrassing loss for India. Bowling badly exposed. No meet up in Melbourne unfortunately. pic.twitter.com/HG6ubq1Oi4
— Shoaib Akhtar (@shoaib100mph) November 10, 2022