భారత్-పాక్ మ్యాచ్ పై విచారణ.. ఇంతకీ అసలు ఏమి జరుగుతోంది?

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 04:08 PM IST

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నరాలు తెగేంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై రకరకాలుగా వార్తలు వినిపిస్తోన్నాయి. చివరి ఓవర్ 4వ బాల్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడానిపుణులు తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఈ మ్యాచ్ పై స్పందిస్తూ..”అసలు థర్డ్ అంపైర్ ను అడగకుండా నో బాల్ ఎలా ఇచ్చారు. అదీ కాక ఫ్రీ హిట్ బాల్ కు కోహ్లీ అవుట్ అయితే.. దాన్ని డెడ్ బాల్ గా ఎందుకు ప్రకటించలేదు” అని ప్రశ్నించాడు. దాంతో వివాదానికి తెరలేపినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ పై విచారణ జరపాలని పాక్ నటుడు అలీ జాఫర్ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇండియా-పాక్ మ్యాచ్.. టీ20 వరల్డ్ కప్ లో పెద్ద వివాదానికి తెరలేపింది. క్షణ క్షణ ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిందే. అయితే ఈ మ్యాచ్ పై ఒక్కో వివాదం ముసురుకుంటుంది. చివరి ఓవర్లో 4వ బాల్ ను అంపైర్లు నో బాల్ ప్రకటించడమే.. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ఒక్క బాల్ నో బాల్ ఇవ్వకుండా ఉంటే పాక్ గెలిచేదే అని పాక్ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్క బాలే మ్యాచ్ స్వరుపాన్నే మార్చేసిందని వారి వాదన వేదన. ఇక ఈ నోబాల్ వ్యవహారంపై బ్రాడ్ హాగ్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. పాక్ సింగర్, నటుడు అయిన అలీ జాఫర్ వివాదాస్పద ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ లో అతడు ఈ విధంగా రాసుకొచ్చాడు.”క్రికెట్ నిబంధనల గురించి, క్రీడానిపుణుల ఏం చెబుతున్నారో నాకు తెలీదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ పై విచారణ జరపాలి. ఆ నోబాల్ మ్యాచ్ నే మలుపు తిప్పింది. దానికి సంబంధించి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మైదానంలోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు” అంటూ బ్రాడ్ హాగ్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. రాసుకొచ్చాడు. ఈ వ్యవహారంపైనే పాక్ ఫాస్ట్ బౌలర్ అక్తర్ కూడా అంపైర్లపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇక అలీ జాఫర్ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.”క్రికెట్ నిబంధనల గూర్చి తెలియనప్పుడు మూసుకుని కూర్చోకుండా ఎందుకు వాగుతున్నావ్” అంటూ కొందరు మండిపడుతుంటే..”షూటింగ్ లు చేసుకోకుండా ఎందుకు భయ్యా నీకిందంతా?” అంటూ చురకలు అంటిస్తున్నారు. వరుసగా ఈ నోబాల్ పై విమర్శలు వస్తూనే ఉన్న క్రమంలో ఐసీసీ ఏవిధంగా స్పందిస్తుందో, ఏం జరుగుతుందో అని సగటు క్రీడాభిమానులు వేచి చూస్తున్నారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV