టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగిన రెండు టీ20 సిరీస్ ల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఆ జోరుతోనే భారత్ పొట్టి ప్రపంచ కప్ లోకి అడుగు పెట్టింది. మునుపటి ప్రదర్శనకు తగ్గట్లుగానే తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి తన జోరు చూపించింది. అయితే టీమిండియా విజయాల్లో ప్రధానంగా వినిపిస్తోన్న పేరు.. సూర్యకుమార్ యాదవ్. గ్రౌండ్ నలువైపులా సిక్స్ లు, బౌండరీలు బాదుతూ.. మిస్టర్ 360 గా పేరుతెచ్చుకున్నాడు SKY.దాంతో అతడి ఆటపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆసిస్ మాజీ స్టార్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ..”టీమిండియాకు ఒంటి చేత్తో ప్రపంచ కప్ అందించ గల ఆటగాడు సూర్యకుమార్” అని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సైతం SKYపై ప్రశంసల వర్షం కురిపించాడు.
సూర్య కుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట వినిపిస్తోన్నపేరు. అందుకు కారణం అతడి భీకరమైన ఫామ్. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీ సారి నేనున్నానంటూ.. ఆపద్భాంధవుడిలా మారతాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సైతం.. టాపార్డర్ మెుత్తం కుప్పకూలినా, 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 68 పరుగులు చేశాడు. దాంతో భారత్ 133 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో అతడి స్టైక్ రేట్ 170 ఉండటం విశేషం. ఇక టీమిండియా ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్ లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బౌలర్ బంతిని ఎక్కడ వేసినాగానీ అతడి ధ్యేయం ఒక్కటే.. బంతిని బౌండరీ దాటించడం.
SKY తాజా ఇన్నింగ్స్ పై పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ..”సూర్య మంచి టెక్నిక్ గల బ్యాటర్. పిచ్ పై ఉన్న పేస్ ను ఉపయోగించుకుంటూ.. అతడు కొట్టే లూప్ షాట్స్ అమోఘం. అతడు బౌలర్ల మైండ్ సెట్ తో ఆడుకోగలడు. ఆ విధంగా సూర్య బౌలర్లపై ఒత్తిడి తెచ్చి వారి లయను దెబ్బతీస్తాడు. దాంతో బౌలర్లు వారి లైన్ అండ్ లెన్త్ ను చేంజ్ చేస్తారు. అప్పుడు వారిమీద దాడికి దిగుతాడు సూర్య. ఇది ప్రతీ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కు ముఖ్యమైంది. అప్పుడే ఎక్కువ పరుగులు సాధించడానికి వీలైతుంది. నేను అతడి లూప్ షాట్స్ కు ఫిదా అయిపోయా” అని మాలిక్ అన్నాడు. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ పై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ప్లెమింగ్ సైతం సూర్య ఆటను ప్రశంసించాడు.
Pakistan all-rounder Shoaib Malik has lauded Suryakumar Yadav on his ability to read the bowler’s mind #INDvSA #T20WorldCup https://t.co/zIAjMQCEQ8
— CricWick (@CricWick) October 30, 2022