ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఏ మాత్రం అంచనాలకు అందకుండా సాగుతోంది. తొలి సెమీ ఫైనల్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు పాకిస్థాన్ షాకిచ్చింది. సూపర్ 12లో పసికూన జింబాబ్వే చేతిలో ఓడి.. అదృష్టం కొద్ది సెమీస్ చేసిన పాక్.. అంచనాలకు మించి రాణించింది. టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం అనుకున్న పాక్ జట్టు.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్‌లో వెళ్లి కూర్చుంది. పాకిస్థాన్ ఇప్పుడు ఫైనల్లో ఉందంటే అందుకు ప్రధాన కారణం.. నెదర్లాండ్స్ అనే చెప్పాలి. ఆ పసికూన జట్టు పటిష్టమైన సౌతాఫ్రికాను సూపర్ 12లో ఓడించకపోయి ఉంటే.. పాకిస్థాన్ ఇంటి దారి పట్టేది. కానీ.. కాలం కలిసొచ్చి సెమీస్‌కు చేరి.. న్యూజిలాండ్‌పై విజయంతో ఇప్పుడు ఫైనల్ చేరింది.
సెమీస్‌లో పాకిస్థాన్ విజయంపై పాక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1992 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. అయితే.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై పాక్ విజయంతో ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కాస్త అతి చేశాడు. పాక్ విజయం సాధించగానే.. టీమిండియాకు సవాలు విసురుతూ.. ఒక వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోలో అక్తర్ మాట్లాడుతూ..‘డియర్ హిందుస్థాన్. మేము మెల్‌బోర్న్(ఫైనల్ వేదిక) చేరుకున్నాం. మీ కోసం ఎదురుచూస్తున్నాం. రేపు మీరు ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్‌కు రావాలని కోరుకుంటున్నాను. అందుకు మీకు బెస్ట్ ఆఫ్ లక్. 1992 వరల్డ్ కప్ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది. సంవత్సరాలు మారొచ్చు కానీ.. అవే నంబర్లు. 1992 ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించాం. ఇప్పుడు మీతో ఫైనల్ ఆడాలని ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. నేను కూడా ఇండియా ఫైనల్ చేరాలని కోరుకుంటున్నాను. మరోసారి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగాలి.’ అని అక్తర్ పేర్కొన్నాడు.
సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ రావాలని.. అక్కడ చూసుకుందామని సుతిమెత్తగా అక్తర్ టీమిండియాకు సవాల్ విసిరాడు. అయితే.. అక్తర్ వీడియోపై ఇండియన్ క్రికెట్ అభిమానులు సైతం అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఫైనల్ చేరినందుకు శుభాకాంక్షలు.. 2007 టీ20 వరల్డ్ కప్ సీన్‌రిపీట్ చేసే అవకావం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ పేర్కొంటున్నారు. కాగా.. తొలి టీ20 వరల్డ్ కప్ సౌతాఫ్రికాలో 2007లో జరిగిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో బౌలౌట్‌తో పాక్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో మళ్లీ పాకిస్థాన్‌ను ఓడించి కప్ కొట్టింది. ఈ సారి కూడా.. ఇప్పటికే సూపర్ 12లో ఒక సారి ఓడించిన భారత్.. ఇంగ్లండ్‌పై సెమీస్ గెలిచి.. ఫైనల్ చేరి.. ఫైనల్లో మరోసారి పాకిస్థాన్‌పై విజయం సాధించి.. టీ20 వరల్డ్ కప్‌ను గెలుస్తుందని ఇండియన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Dear India, good luck for tomorrow. We’ll be waiting for you in Melbourne for a great game of cricket. pic.twitter.com/SdBLVYD6vm
— Shoaib Akhtar (@shoaib100mph) November 9, 2022