ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచేందుకు అన్ని జట్లు వ్యూహ్యాలు రచిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు గ్రూప్‌స్టేజ్ మ్యాచ్‌లు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో పాటు భారత్, ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. కాగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 23న ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఒక వామప్ మ్యాచ్ ఆడింది. న్యూజిలాండ్‌తో రెండో వామప్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా.. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఈ ఆదివారం పాకిస్థాన్‌తో అసలు సిసలైన పోరుకు టీమిండియా సిద్ధమైంది.
ఇక ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్‌కు ఒంటిచేత్తో టీ20 వరల్డ్ కప్ అందిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. వాట్సన్ మాట్లాడుతూ.. ‘హార్దిక్ పాండ్యా ఎంతో ప్రతిభావంతమైన ఆటగాడు. అతను తన బ్యాటింగ్, బౌలింగ్‌తో టీమిండియా ఎంతో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. పాండ్యా కేవలం ఫినిషర్ మాత్రమే కాదు.. హార్డ్ హిట్టర్ కూడా. అతను పవర్ హిట్టింగ్‌తో పాటు 140 కిమీ వేగంతో బౌలింగ్ కూడా వేయగలడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పాండ్యా ఎలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించినట్లే.. భారత్‌కు ఒంటి చేత్తో ఈ టీ20 వరల్డ్ కప్ అందిస్తాడు.’ అని వాట్సన్ పేర్కొన్నాడు.
కాగా.. ఐపీఎల్ 2022 కంటే ముందు పూర్ ఫామ్, గాయాలతో టీమిండియా స్థానం కోల్పోయిన హార్దిక్ పాండ్యా.. సర్జరీ తర్వాత ఒక కొత్త ఆటగాడిగా మారిపోయాడు. శస్త్రచికిత్స తర్వాత.. నేరుగా ఐపీఎల్ 2022లోకే ఎంట్రీ ఇచ్చిన పాండ్యా.. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆ జట్టును తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. తన ఈ ప్రదర్శనతో తిరిగి టీమిండియాలోకి వచ్చిన పాండ్యా.. అప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టుకు నిఖార్సయిన ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు. బ్యాటింగ్‌లో ఫినిషర్ కమ్ హిట్టర్‌గా తన పాత్ర పోషిస్తూ.. బౌలింగ్ విభాగంలో ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా మారిపోయాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాండ్యా టీమిండియాకు తురుపుమొక్కగా ఉన్నాడు.
Former Australian all-rounder Shane Watson lavishes praise on Hardik Pandya.#CricTracker #HardikPandya #ShaneWatson pic.twitter.com/t3Fr44ppC4
— CricTracker (@Cricketracker) October 20, 2022