ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఓడిన టీమిండియా.. అంతకుముందు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక బంగ్లాపై కూడా గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలిన రోహిత్ సేన ఎంతో ఉత్సాహంతో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు ఒక ఓటమితో సెమీస్ రేసులో ఉంది. ఇక టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ టీమ్ ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ గెలిచేందుకు రాలేదని సంచలన కామెంట్ చేశాడు.
షకీబ్ మాట్లాడుతూ..‘ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమే. ఏ ఒక్క ప్రత్యర్థి గురించే ఆలోచించాలనుకోవడం లేదు. మా ప్లాన్స్ ప్రకారం మేము ముందుకువెళ్తాం. ఇక ఈ వరల్డ్ కప్‌లో మా జట్టులోని ఆటగాళ్ల స్ట్రైక్ రేట్ గురించి మాకు ఎలాంటి దిగులులేదు. ఎందుకంటే టీమ్ మొత్తం గెలుపుకోసం ఆడుతున్నాం. టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. భారత్ లేదా పాకిస్థాన్‌ను మేము ఓడిస్తే.. అది పెద్ద అప్సెట్ అవుతుంది. కానీ.. మాదైన రోజున ఏం కచ్చితంగా గెలుస్తాం. అలాగే ఈ టోర్నీలోనే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పాకిస్థాన్, ఇంగ్లండ్‌లను ఓడించడం మనం చూశాం. మేము కూడా అలానే చేస్తే.. నాకెంతో సంతోషం ఉంటుంది.’ అని అన్నాడు.
ఇక భారత్‌తో మ్యాచ్ గురించి మాట్లాడుతూ..‘ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. పైగా స్టేడియంలో వారికే ఎక్కువ మద్దతు లభిస్తుంది. ఇండియా ఎక్కడ క్రికెట్ ఆడినా వారికి భారీగా సపోర్ట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ కూడా హౌస్ ఫుల్‌గా ఉండనుంది. అయితే ఇండియా ఇక్కడి వరల్డ్ కప్ గెలిచేందుకు వచ్చింది. కానీ.. మేము వరల్డ్ కప్ గెలిచేందుకు రాలేదు. మేము ఇండియాను ఓడిస్తే.. అది అప్సెట్ అవుతుంది. మేము ఇండియాను ఓడించేందుకు మా వంత ప్రయత్నం చేస్తాం.’ అని షకీబ్ అన్నాడు. అయితే తాము వరల్డ్ కప్ గెలిచేందుకు ఇక్కడి రాలేదు అనే షకీబ్ కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. నెటిజన్లు షకీబ్ అల్ హసన్ కామెంట్స్‌పై నవ్వుకుంటున్నారు. కానీ.. షకీబ్ తన కామెంట్స్‌తో టీమిండియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. తామకు వరల్డ్ కప్ అవసరం లేదని తాము ఎంతో ఫ్రీగా ఆడతామని, కానీ.. భారత్ వరల్డ్ కప్ గెలిచేందుకే ఇక్కడికి వచ్చిందని.. ఆ జట్టుకు గెలుపు ఎంతో అసవరమని చెబుతూ.. ప్రెషర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ రెండు తలా 4 పాయింట్లతో సమంగా ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. కాగా బంగ్లా మూడో స్థానంలో ఉంది.
“India have come to here to win the World Cup. We aren’t here to win the Cup. Us beating India would be an upset and we are aware of that. But we are aiming for an upset”
Bangladesh captain Shakib Al Hasan ahead of the India game. pic.twitter.com/CVTRExORVl
— Nikhil Naz (@NikhilNaz) November 1, 2022