ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో ఏదొక అద్భుతం జరుగుతూనే ఉంది. బంగ్లాదేశ్- జింబాబ్వే మధ్య జరిగిన పోరు అయితే మరీ ఉత్కంఠగా సాగింది. ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. 151 పరుగుల విజయలక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నట్లు కనిపించింది. కాసేపు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఓటమి భయాన్ని చూపించారు. గెలవాల్సిన మ్యాచ్ లో ఆఖరి బంతికి 3 పరుగుల తేడాతో ఓడిపోయారు. బంగ్లాదేశ్ కూడా చివరి ఓవర్ వరకు వదలకుండా పోరాడి విజయాన్ని సొంతం చేసుకుందే. అంతేకాకుండా సెమీస్ ఆశలను సజీవంగానే ఉంచుంకుంది. ఈ మ్యాచ్ ని కెప్టెన్ షకీబ్ ఒటిచేత్తో తిప్పేశాడనే చెప్పాలి.
అవును.. కెప్టెన్ గా షకీబ్ తన పాత్రను ఎంతో సమర్థంగా నెరవేర్చాడు. మ్యాచ్ దాదాపుగా చేజారిపోతోంది అనే సమయంలో ఆట తీరునే మార్చేశాడు. మొదటి 3 ఓవర్లలో ప్రభావం చూపలేకపోయిన షకీబ్.. ఆఖరి ఓవర్లో మాత్రం.. కీలక వికెట్ తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అంతేకాదు.. అప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉన్న సీన్ విలియమ్స్ వికెట్ తీసి తమ జట్టు గెలుపునకు కారణం అయ్యాడు. ఆ వికెట్ మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. నెటిజన్స్ సైతం ఆ వికెట్ పడకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచేదే కాదని చెబుతున్నారు. అది కూడా సాధారణ రనౌట్ కాదు.. ఎంతో అద్భుంతగా సీన్ విలియమ్స్ ని ఔట్ చేశాడు. ప్రస్తుతం షకీబ్ అల్ హసన్ చేసిన రౌనౌట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటింగ్ లోనూ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లలో కేవంల 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. షాంటో 55 బంతుల్లో 71 పరుగుల ఇన్నింగ్స్ మాత్రమే చెప్పుకోదగినదిగా ఉంది. ఇంక అఫీఫ్ హుస్సేన్(29) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలింగ్ కూడా కట్టుదిట్టంగానే చేసింది. నగరవ, ముజరబానీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ లో సీన్ విలియమ్స్(64), ర్యాన్ బర్ల్(27) మాత్రమే ఆకట్టుకోగలిగారు. బంగ్లా బౌలింగ్ చూస్తే.. టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో చెలరేగిపోయాడు. మొసద్దెక్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. వెరసి 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ మ్యాచ్ ని గెలిచింది. జింబాబ్వే మంచి పోరాట పటిమ ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.