క్రికెట్ చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే ప్రమాదాలు తప్పవు. కొన్నిసార్లు మైదానంలోనే ఆటగాళ్లు ప్రాణాలు విడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు బ్యాటర్లు పకడ్బందీగా రెడీ అయి బ్యాటింగ్ చేస్తుంటారు. అయినా సరే కొన్నిసార్లు చిన్నపాటి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. టీ20 ప్రపంచకప్ లోనూ తాజాగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీంతో గాయపడిన బ్యాటర్ ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ కోసం అన్ని జట్లు ఆస్ట్రేలియా వెళ్లిపోయాయి. వార్మల్ మ్యాచులు ఆడుతూ ఫుల్ బిజీగా ఉన్నాయి. పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో యార్కర్లతో భారత్ బ్యాటర్ ని వణికించిన పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ మరోసారి భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. గాయం వల్ల ఆసియాకప్ లో ఆడలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్ తో వార్మప్ మ్యాచులో మాత్రం అదరగొట్టేశాడు. వరస ఓవర్లలో ఓపెనర్లని పెవిలియన్ చేర్చాడు.
షాహీన్ అఫ్రిది తన తొలి ఓవర్ ఐదో బంతిని యార్కర్ గా వేశాడు. ఇది అఫ్ఘన్ బ్యాటర్ గుర్జాబ్ కాలి వేళ్లకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి గుర్బాజ్ కి చికిత్స అందించాడు. అయినాసరే ఫలితం లేకుండా పోయింది. పాక్ ఫీల్డర్స్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇక నడవలేని స్థితిలో ఉన్న గుర్జాబ్ ని అప్ఘన్ సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ భుజానికెత్తుకుని మైదానం బయటకు తీసుకెళ్లాడు. వెంటనే గుర్జాబ్ ని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎడమ పాదానికి స్కానింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అప్ఘన్ జట్టులో వికెట్ కీపర్ గా చేస్తూ కీలక ఆటగాడిగా ఉన్న గుర్జాబ్ కి ఇలా జరగడంతో మేనేజ్ మెంట్ ఆందోళన చెందుతోంది. ఇంగ్లాండ్ తో శనివారం జరిగే మ్యాచ్ టైం కల్లా కోలుకోవాలని కోరుకుంటోంది. మరి షాహీన్ యార్కర్ కి అప్ఘన్ క్రికెటర్ గాయపడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Shaheen Afridi is Back 💪🏻🦅 pic.twitter.com/JdBkNjkS45
— Ayesha 🇵🇰|| shanzay stan 💗 (@aasho56) October 19, 2022